రాహుల్‌ను ముద్దు పెట్టుకున్న పునర్నవి

16 Sep, 2019 22:50 IST|Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో తొమ్మిదో వారంలో చేపట్టిన నామినేషన్‌ ప్రక్రియ ఆద్యంతం ఉత్కంఠగా మారింది.  ఈ క్రమంలో గార్డెన్‌ ఏరియాలో ఓ టెలిఫోన్‌ బూత్‌ను ఏర్పాటు చేశాడు. అందులో ఉన్న ఫోన్‌ మోగిన వెంటనే శ్రీముఖి లోపలికి వెళ్లింది. ఫోన్‌ లిఫ్ట్‌ చేసిన శ్రీముఖిని డైరెక్ట్‌గా నామినేట్‌ అయిందని బిగ్‌బాస్‌ తెలిపాడు. అయితే నామినేషన్‌ నుంచి తప్పించుకునేందుకు శ్రీముఖికి ఓ అవకాశాన్ని ఇచ్చాడు. బాబా భాస్కర్‌ క్లీన్‌ షేవ్‌ చేసుకుంటే.. నామినేషన్‌ నుంచి తప్పించుకోవచ్చని తెలిపాడు. దీంతో శ్రీముఖి అడిగిన వెంటనే క్లీన్‌ షేవ్‌ చేసుకునేందుకు బాబా ఒప్పుకున్నాడు.

అనంతరం పునర్నవి నామినేట్‌ అయినట్లు తెలిపాడు. అయితే నామినేషన్‌ నుంచి తప్పించుకోవాలంటే.. రాహుల్‌ ఇరవై గ్లాసుల కాకరకాయ రసాన్ని తాగాల్సి ఉంటుందని షరుతును విధించాడు. దీంతో పునర్నవి.. రాహుల్‌ను అడగసాగింది. చేయగలవా? లేదంటే వద్దు అంటూ ఉండగా.. ప్రయత్నిస్తానని.. చేయలేకపోతే మధ్యలో వదిలేద్దామంటూ చెప్పుకొచ్చాడు. అయితే పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి చివరకి పూర్తి చేసేశాడు. దీంతో పునర్నవి సేవ్‌ అయినట్లు తెలిపాడు. అనంతరం రాహుల్‌ను హగ్‌ చేసుకుని.. ముద్దు పెట్టుకుంది.

వరుణ్‌ కోసం.. శ్రీముఖి బిగ్‌బాస్‌ ట్యాటు వేసుకుంది. అయితే మహేష్‌ కోసం చేయాల్సిన టాస్క్‌ను హిమజ సరిగ్గా చేయలేకపోవడంతో అతను నామినేట్‌ అయినట్లు బిగ్‌బాస్‌ తెలిపాడు. హిమజ.. తన బట్టలు, మేకప్‌ స్కిట్‌ను స్టోర్‌రూమ్‌లో పెట్టాలని సూచించాడు. కొన్ని వస్తువులను మర్చిపోయిన కారణంగా మహేష్‌ నామినేట్‌ అయినట్లు తెలిపాడు. బాబా భాస్కర్‌ కోసం రవి తన షూస్‌ను పెయింట్‌లో ముంచాడు. శివజ్యోతి కోసం మహేష్‌ తన జుట్టుకు ఎరుపు రంగను వేసుకున్నాడు.

ఇక హిమజ కోసం.. పేడ తొట్టెలో పడుకోడానికి వరుణ్‌ సిద్దపడ్డాడు. అయితే వరుణ్‌కు సహాయం చేసే ప్రయత్నంలో వితికా కాలుజారి పడింది. దీంతో హిమజ.. టాస్క్‌ను చేయొద్దంటూ వరుణ్‌ను బతిమిలాడింది. తాను సెల్ఫ్‌ నామినేట్‌ అవుతానని బిగ్‌బాస్‌కు తెలిపింది. అయినా వరుణ్‌ అతి కష్టం మీద ఆ టాస్క్‌ను పూర్తి చేశాడు. దీంతో హిమజ సేవ్‌ అయినట్లు ప్రకటించాడు. మరి మిగతా వారిలో ఎవరు ఎవరికోసం ఎలాంటి త్యాగాలు చేస్తారో చూడాలి.


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు