హల్‌చల్‌ చేస్తోన్న బిగ్‌బాస్‌-3 ప్రోమో

22 Jun, 2019 10:24 IST|Sakshi

అన్ని భాషల్లో విజయవంతమైన బిగ్‌బాస్‌ కార్యక్రమం తెలుగు నాట బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మొదటి సీజన్‌ను మించి రెండో సీజన్‌ ఆకట్టుకోగా.. మూడో సీజన్‌ కోసం ఎదరుచూస్తున్నారు. ఇటీవలె స్టార్‌ మా బృందం త్వరలోనే మూడో సీజన్‌ మొదలుకానుందని ప్రకటించింది. తాజాగా ఓ ప్రోమోను కూడా విడుదలచేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఇప్పటికే మూడో సీజన్‌ హోస్ట్‌గా కింగ్‌ నాగార్జున వ్యవహరించబోతున్న విషయం తెలిసిందే. డిఫరెంట్‌గా డిజైన్‌ చేసిన ఈ ప్రోమో నెటిజన్లను ఆకర్షిస్తోంది.

ఓ స్వామిజీ ఉపదేశం ఇస్తున్నట్లుగా బిగ్‌బాస్‌ హౌస్‌ గురించి వివరిస్తూ.. ‘మనసు కోతిలాంటిది మరి అలాంటి మనసున్న మనుషులు, ఓ ఇంట్లో చేరితే.. మమకారంతో వెటకారంతో ఏకతాటిపైకి తెచ్చేదెవరు? అధికారంతో నడిపేది ఎవరు? ఆ ఇంట్లో కొత్త ఉత్సాహాన్ని నింపే శక్తి గల వ్యక్తి ఎవరు?’  అని అంటుంటే.. అక్కడ ఆయన ముందు కూర్చున్న వారికే కాదు ప్రోమో చూస్తున్నవారికి కూడా ఆసక్తి కలిగించేలా క్రియేట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్‌ అవుతోంది. ఇక ఈ మూడో సీజన్‌ మరింత రసవత్తరంగా ఉండబోతోందని, అయితే సామాన్యుడికి ఈ సారి ఎంట్రీ లేదని తెలుస్తోంది. అయితే ఇప్పటికే వరకు కంటెస్టెంట్ల వివరాలు అధికారికంగా బయటకు రాకపోవడంతో.. ఇప్పటికీ ఊహాగానాలతో ఎవరికి వారు ఓ లిస్ట్‌ను తయారు చేసి సోషల్‌ మీడియాలో వదులుతున్నారు. త్వరలోనే కంటెస్టెంట్ల వివరాలు ప్రకటించనున్నట్లు సమాచారం. జూలైలో బిగ్‌బాస్‌ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా