గొడవలు పెట్టేందుకు.. బిగ్‌బాస్‌ రంగంలోకి దిగాడా?

23 Aug, 2019 19:33 IST|Sakshi

బిగ్‌బాస్‌ అంటేనే గొడవలు.. అరుపులు.. వాటితో వచ్చే టీఆర్పీలు. కొంతమందిని ఓ ఇంట్లో పడేసి.. బయటి ప్రపంచంతో సంబంధాలను తెంచేయడం.. ఊరికే ఉన్నవారిని అలా ఉండనీయకపోవడం.. టాస్క్‌ల పేరిట వారి అంతరాలను బయటకు లాగడమే బిగ్‌బాస్‌ పని. అయితే ఈ మూడో సీజన్‌లో బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌లు సరిగా లేవో.. లేదా.. హౌస్‌మేట్స్‌ సరిగ్గా పార్టిసిపేట్‌ చేయడం లేదో గానీ ఏ ఒక్క ఘటన అంతగా హైలెట్‌ కావడం లేదు. 

పైగా ఇంటి సభ్యుల మధ్య చిన్నాచితక గొడవలు తప్పా.. హౌస్‌ దద్దరిల్లే గొడవలు ఒక్కటీ లేకపోవడం బిగ్‌బాస్‌కు మింగుడుపడటం లేనట్టుంది. తాజాగా విడుదల చేసిన ప్రోమోను చూస్తుంటే.. ఈ రోజు హౌస్‌లో పెద్ద చర్చలే జరిగేట్టు కనబడుతోంది. ఓ ఇంటిసభ్యుడి వెనక మిగతా హౌస్‌మేట్స్‌ ఏం మాట్లాడుకున్నారో అన్న వీడియోలను ప్లే చేసి చూపించి.. వారి మధ్య గొడవలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

కిచెన్‌లోకి ఎంటర్‌ అయితే పునర్నవి ఎలానో ప్రవర్తిస్తుందని, తనను అది చెయ్‌ ఇది చెయ్‌ అంటే కాలుద్ది అని పునర్నవిని ఉద్దేశించి వితిక అన్న మాటలను ఆమెకు ప్లే చేసి చూపించాడు బిగ్‌బాస్‌. బయటకు వచ్చిన పునర్నవి.. వితికాపై ఫైర్‌ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై రాహుల్‌తో పునర్నవి చర్చించనున్నట్లు కనపడుతోంది. ఇక రాహుల్‌ మాట్లాడిన విషయాలను సైతం శ్రీముఖికి చూపించాడు బిగ్‌బాస్‌. మరి ఆమె ఏ విధంగా రియాక్ట్‌ అవుతుందో? ఇప్పటికే హిమజ-బాబా భాస్కర్‌ గొడవ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండగా.. ఈ రోజు హౌస్‌లో ఎలాంటి సంఘటనలు జరగనున్నాయో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వారికి హౌస్‌లో ఉండే అర్హత లేదు : అషూ

నాగార్జున పేరును మార్చిన బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌.. అషూ ఎలిమినేటెడ్‌!

బిగ్‌బాస్‌.. వరుణ్‌కు వితికా శత్రువా?

బిగ్‌బాస్‌.. ఎలిమినేట్‌ అయింది ఆమేనా?

బాబా.. ఇది కామెడీ కాదు సీరియస్‌ : నాగ్‌

సీక్రెట్‌ టాస్క్‌లో ఓడిన హిమజ

బిగ్‌బాస్‌.. అది సీక్రెట్‌ టాస్కా?

‘ఇరగ’ దీసిన పునర్నవి.. ‘జిగేల్‌’మనిపించిన అషూ

బిగ్‌బాస్‌.. కెప్టెన్‌గా ఎన్నికైన శివజ్యోతి

బాబా భాస్కర్‌-అలీ వ్యవహారం ముదురుతోందా?

బిగ్‌బాస్‌.. అలీరెజాపై మహేష్‌ ఫైర్‌

కన్నీరు పెట్టిన బాబా.. ఓదార్చిన శ్రీముఖి

బిగ్‌బాస్‌.. కంటతడి పెడుతున్న బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌.. రాహుల్‌కు పునర్నవి షాక్‌!

రోహిణి అవుట్‌.. వెక్కి వెక్కి ఏడ్చిన శివజ్యోతి

బిగ్‌బాస్‌.. ఓట్లు తక్కువ వచ్చినా సేవ్‌!

బిగ్‌బాస్‌.. రోహిణి ఎలిమినేటెడ్‌!

శ్రీముఖికి.. లౌడ్‌ స్పీకర్‌ అవార్డు

పునర్నవి, రాహుల్‌కు క్లాస్‌ పీకుతున్న నాగ్‌

ఈ వారం ‘బిగ్‌’ సర్‌ప్రైజ్‌ ఉందా?

‘అందరికీ రాఖీ శుభాకాంక్షలు.. రాహుల్‌కు తప్ప’