రాహుల్‌తో రిలేషన్‌షిప్‌ లీక్‌ చేసిన పునర్నవి

19 Sep, 2019 08:32 IST|Sakshi

బిగ్‌బాస్‌.. ఉత్కంఠభరితమైన నామినేషన్‌తో ప్రారంభమైన తొమ్మిదో వారం సరదాగా కొనసాగుతోంది. అయితే బాబా భాస్కర్‌, రాహుల్‌ అందరి ముందు తనను కామెంట్‌ చేశారని శివజ్యోతి ఏడుపు లంకించుకోగా ఎమోషనల్‌గా ఎక్కడ డిపెండ్‌ అయ్యాను అంటూ వారిద్దరితో చాలాసేపు వాదించింది. చివరికి తాను జోక్‌గా మాత్రమే అన్నానని రాహుల్‌ సారీ చెప్పగా, నువ్వు బాగుండాలనే ఉద్దేశంతో చెప్పానని బాబా భాస్కర్‌ సర్ది చెప్పాడు. కాగా నామినేషన్‌ టాస్క్‌లో మహేశ్‌ కోసం త్యాగం చేయడం ఇష్టం లేకే హిమజ తన దుస్తులను అసంపూర్తిగా పంపించిందని రాహుల్‌.. బాబా భాస్కర్‌తో అన్నాడు. ‘కెమెరాల ముందు బ్యాడ్‌ అవద్దు, కానీ తన కోసం త్యాగం చేసినట్టు ఉండాలి, మళ్లీ బట్టలు మర్చిపోయినట్టు నటించాలి’ ఇదే ఆమె ప్లానని రాహుల్‌ పేర్కొన్నాడు.

ఇక ఇంటిసభ్యులకు ఇచ్చిన క్రేజీ కాలేజీ టాస్క్‌లో భాగంగా పాఠాలు చెప్పిన టీచర్లు వరుణ్‌, వితిక, బాబా భాస్కర్‌లు విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. చిల్లాలజీ లెక్చరర్‌ వరుణ్‌ పెట్టిన పరీక్షలో స్టూడెంట్స్‌ మహేశ్‌, శివజ్యోతి, హిమజలు 5 స్టార్స్‌ తెచ్చుకోగా శ్రీముఖి, రాహుల్‌లు మాత్రం 4 స్టార్లతో వెనకబడిపోయారు. ఇక గాసిపాలజీ టీచర్‌ వితిక నిర్వహించిన పరీక్షలో శివజ్యోతి టీచర్‌పైనే గాసిప్‌ సృష్టించగా, ఇద్దరి మధ్య ఎలా గొడవ పెట్టవచ్చు అనే ప్రశ్నకు శ్రీముఖి చెప్పిన సమాధానంతో టీచర్‌ను నోరెళ్లబెట్టేలా చేసింది. నువ్వు విన్న బిగ్గెస్ట్‌ గాసిప్‌ చెప్పమని పునర్నవిని అడగ్గా అది బయటపెడితే జనాలు తనను చితకబాదుతారని పేర్కొన్నప్పటికీ మహేశ్‌-బాబా భాస్కర్‌ల మధ్య పెరుగుతున్న దూరాన్ని సమాధానంగా చెప్పింది.

అనంతరం టీచర్‌ వితిక తాను విన్న గాసిప్‌లపై విద్యార్థులను ప్రశ్నించింది. మన గురించి గాసిప్‌ వస్తే అది గొప్ప విషయమని పునర్నవి పేర్కొంది. మీరు ఫ్రెండ్సా? లవర్సా? అని రాహుల్‌-పునర్నవిలను నిలదీయగా అటు ఫ్రెండ్స్‌ కాదు, ఇటు లవర్స్‌ కూడా కాదు.. కాంప్లికేటెడ్‌ ఫ్రెండ్స్‌ అని చెప్పి పున్ను తప్పించుకుంది. ఇక హిమజ- మహేశ్‌లను పిలిచి గత నామినేషన్‌ ప్రక్రియలో కావాలనే మహేశ్‌ను సేవ్‌ చేయలేదా అని హిమజను ప్రశ్నించగా పొరపాటు వల్ల జరిగిందే తప్ప కావాలని చేయలేదని చెప్పింది. ఇక గాసిపాలజీ  పరీక్షలో అందరికన్నా ఎక్కువగా శ్రీముఖి, పునర్నవి, రవి 4 స్టార్లను సాధించి ఆధిక్యంలో నిలిచారు. మిగిలిన లవ్వాలజీ పరీక్షలో భాగంగా స్టూడెంట్స్‌ లవ్‌ ప్రపోజల్‌ చేయాల్సి ఉండగా బాబా భాస్కర్‌, వితికలు జడ్జిలుగా వ్యవహరించారు. మహేశ్‌- శివజ్యోతి, రవి-శ్రీముఖి, మహేశ్‌- పునర్నవి, రాహుల్‌-హిమజలు జంటలుగా నటించారు. అందరూ పరవాలేదనిపించినా ఉన్నదాంట్లో రాహుల్‌-హిమజ జంట బాగా చేయడంతో వారిని విజేతలుగా ప్రకటించారు. అనంతరం ఆ జంట వచ్చీరాని డాన్స్‌ చేసి హౌస్‌లో నవ్వులు పూయించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు