రాహుల్‌ కోసం పునర్నవి అంత పని చేస్తుందా..?

17 Sep, 2019 11:07 IST|Sakshi

గత సీజన్లలో వచ్చిన నామినేషన్‌ టాస్క్‌నే ఈ సీజన్‌లోనూ బిగ్‌బాస్‌ మక్కీకి మక్కీ దించాడు. ఇక ఇంటిసభ్యులందరూ ఎలిమినేషన్‌ నుంచి గట్టెక్కడానికి అరక్షణమైనా ఆలోచించకుండా ఒకరికోసం ఒకరు త్యాగాలకు సిద్ధపడిపోతున్నారు. ఒక్కరోజులో పూర్తయ్యే నామినేషన్‌ ప్రక్రియ ఈసారి పొడిగించి రెండోరోజుకు చేరుకుంది. రోజులు దగ్గరపడుతున్న కొద్దీ ఆటలో ఎవరికి వారే స్వతంత్రంగా పోటీచేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌ చూస్తే కావాలనే అందరినీ ఎమోషనల్‌గా మరింత దగ్గర చేసి విడదీయనున్నాడా అనే సందేహం రాకమానదు. కాగా హిమజ త్యాగం చేయటంలో చిన్న చిన్న తప్పిదాలు చేయడం వల్ల మహేశ్‌ నామినేట్‌ అయ్యాడు. ఇక నామినేషన్‌ రౌండ్‌లో వితిక, రవి, రాహుల్ మాత్రమే మిగిలారు.‌ వీరిచేత ఎలాంటి త్యాగాలకు ఒప్పించనున్నాడో అని అందరూ ఆస్తిగా ఎదురుచూస్తున్నారు.

ఏ టాస్క్‌ సరిగా చేయడు అని పేరు తెచ్చుకున్న రాహుల్‌ నిన్నటి ఎపిసోడ్‌లో తన తడాఖా చూపించి అందరి నోళ్లు మూయించాడు. పునర్నవి కోసం 20 గ్లాసుల కాకర రసాన్ని గుటగుట తాగేశాడు. తనతో ఫ్రెండ్‌షిప్‌ అక్కర్లేదు అని కుండ బద్ధలు కొట్టి చెప్పిన పునర్నవిని తనంతట తాను దగ్గరికి వచ్చేలా చేసుకున్నాడు. డోంట్‌ గీవప్‌ అని రాహుల్‌కు పదేపదే చెప్పే పునర్నవి జ్యూస్‌ తాగటం కష్టం అని వదిలేయమని చెప్పినప్పటికీ రాహుల్‌ వినిపించుకోలేదు. స్నేహం కోసం, తనను సేవ్‌ చేయడం కోసం ఎంత కష్టమైనా ఇష్టంగా చేసి పునర్నవి మనసు దోచుకున్నాడు. అనంతరం నామినేషన్‌ నుంచి సేవ్‌ అయ్యావని చెప్పగానే పునర్నవి.. రాహుల్‌ను హత్తుకుని ముద్దుపెట్టింది. ఇక  రాహుల్‌ పునర్నవిల స్నేహం మరింత గట్టిపడిందని సంతోషించేలోపే బిగ్‌బాస్‌ ఓ ట్విస్ట్‌ ఇవ్వనున్నాడు. రాహుల్‌ను సేవ్‌ చేయడానికి పునర్నవి సీజన్‌ మొత్తం నామినేట్‌ చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటించాడు. దీనికి మొదట పున్ను నిరాకరించినట్టు కనిపించినా చివరికి ఏదో జరిగినట్టు తెలుస్తోంది. రాహుల్‌ కోసం పునర్నవి అంతటి త్యాగానికి సిద్ధపడుతుందా, లేదా అన్నది చూడాలి..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు