బిగ్‌బాస్‌.. పునర్నవిపై రాహుల్‌ సీరియస్‌

12 Sep, 2019 23:10 IST|Sakshi

బిగ్‌బాస్‌ చెప్పిందే శాసనం. ఆయన ఆదేశిస్తే.. అందరూ అది పాటించాల్సిందే. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆయన మాటే శాసనం అవుతుంది. అలాంటి బిగ్‌బాస్‌ ఆదేశాలను బేఖాతరు చేసింది పునర్నవి. అయినా వరుణ్‌ సందేశం బుజ్జగింపులతో చిట్టచివరకు తలొగ్గింది. బిగ్‌బాస్‌ ఆదేశాలను పాటించనని మొండికేసిన పునర్నవి.. చివరకు తలొగ్గి షూ పాలిష్‌ చేయడం, కెప్టెన్‌గా వితికా ఎన్నికవడం.. రాహుల్‌-పునర్నవిల మధ్య గొడవ జరగడం హైలెట్‌గా నిలిచింది.

కెప్టెన్‌గా ఎన్నికైన వితిక
ఎనిమిదో వారంలో బిగ్‌బాస్‌ హౌస్‌ కెప్టెన్‌గా వితికా షెరు ఎన్నికైంది. బరువులెత్తగలవా.. జెండా పాతగలవా అనే ఈ కెప్టెన్సీ టాస్క్‌కు వితికా, శ్రీముఖి, మహేష్‌ పోటీపడగా.. వారికి సహాయం చేసేందుకు వరుణ్‌, రవి, శివజ్యోతిలను ఎంచుకున్నారు. వరుణ్‌ సందేశ్‌ వితికాను, రవి.. శ్రీముఖిని, మహేస్‌.. శివజ్యోతిని ఎత్తుకున్నారు. ఒక సైడ్‌ ఉన్న జెండాలను మరోవైపు పెట్టాలని... అలా ఎండ్‌ ప్లేస్‌ వరకు ఎక్కువ జెండాలను పెడితే వారే కెప్టెన్‌గా ఎన్నికవుతారని తెలిపాడు. ఈ క్రమంలో వరుణ్‌, మహేష్‌లు తొందరగా టాస్క్‌ను పూర్తి చేసేందుకు చాలా కష్టపడ్డారు. అయితే శ్రీముఖిని ఎత్తుకున్న రవికి మాత్రం ఈ టాస్క్‌ను చేయడం మరింత కష్టంగా మారినట్టు కనిపించింది. చివరకు ఈ టాస్క్‌లో అందరికంటే ఎక్కువ జెండాలను పాతి వితికా విన్నర్‌గా నిలిచింది. ఇక కెప్టెన్‌గా ఎన్నికైన వితికా ఆనందానికి అవదుల్లేవు.

పునర్నవి-రాహుల్‌ మధ్య గొడవ
కెప్టెన్సీ టాస్క్‌లో వితికాకు రాహుల్‌ సహాయం చేస్తానని చెబుతూ ఉండగా.. చెయ్యి నొప్పి, కాలు నొప్పి అంటావ్‌ నీకవసరమా? అని పునర్నవి అంది. ఇదే విషయాన్ని టాస్క్‌ అనంతరం వితికా, పునర్నవి, వరుణ్‌ చర్చించుకుంటూ ఉంటే.. రాహుల్‌ మధ్యలో వచ్చి ఫైర్‌ అయ్యాడు. నువ్వెందుకలా అన్నావ్‌ అంటూ పునర్నవిని మందలించాడు. నువ్వు చేయలేవు కాబట్టి అన్నాను అంటూ రివర్స్‌ కౌంటర్‌ వేసింది. ఇలా మాటామాట పెరుగుతూ ఉండగా వితికా.. పునర్నవిని రాహుల్‌కు దూరంగా తీసుకెళ్లింది.

అందరి ముందు తను అలా అనడం తనకు నచ్చలేదంటూ వరుణ్‌తో రాహుల్‌ చెప్పుకొచ్చాడు. మళ్లీ కాసేపయ్యాక కాఫీ ఇచ్చేందుకు వచ్చిన పునర్నవితో రాహుల్‌ సీరియస్‌గానే మాట్లాడాడు. ఇక నేను పునర్నవితో మాట్లాడనంటూ వరుణ్‌తో చెప్పుకొచ్చాడు. మరోవైపు వితికా-పునర్నవిలు కూడా రాహుల్‌ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. మనం వస్తే వద్దంటున్నాడు.. అదే వరుణ్‌తో మాట్లాడుతున్నాడంటూ రాహుల్‌ గురించి ముచ్చటించుకున్నారు. మరి వీరి గొడవ కొద్ది క్షణాలే అన్న విషయం అందరికీ తెలిసినా.. శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో ఏం జరుగనుందో చూడాలి.

హయర్‌ రిఫ్రిజిరేటర్‌ టాస్క్‌ను ఇచ్చిన బిగ్‌బాస్‌.. ఇంటి సభ్యుల్లోంచి ఎవరో ఒకర్ని ఎంచుకోవాలని తెలిపాడు. వారికి ట్రిక్‌ లేదా ట్రీట్‌ను ఇవ్వాల్సి ఉంటుందని.. ట్రిక్‌ అంటే ఐస్‌ క్యూబ్‌ను వారి మీద వేయడం.. ట్రీట్‌ అంటే ఫ్రిజ్‌లో ఉన్న తినుబండారాలను ఇవ్వడమని సూచించాడు. ఇక శ్రీముఖి.. బాబా భాస్కర్‌కు, శిల్పా.. రాహుల్‌కు ట్రిక్‌ను ఎంచుకుని వారి మీద ఐస్‌క్యూబ్స్‌ను వేశారు. మిగతా హౌస్‌మేట్స్‌ అందరూ ట్రీట్‌ ఇచ్చుకున్నారు. ఇలా గురువారం నాటి ఎపిసోడ్‌ ఆనందంగా ముగిసింది.

  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌ దెబ్బకు దిగొచ్చిన పునర్నవి

బిగ్‌బాస్‌.. రాహుల్‌ మళ్లీ రీచార్జ్‌ చేస్తాడా?

బిగ్‌బాస్‌.. అయ్యో పాపం అంటూ రవికి ఓదార్పు!

బిగ్‌బాస్‌ హౌజ్‌లో కూతురిపై తండ్రి ఆగ్రహం

పునర్నవి డేరింగ్‌.. బిగ్‌బాస్‌పైనే తిరుగుబాటు!

బిగ్‌బాస్‌.. రవిని బురిడీ కొట్టించిన బాబా

బిగ్‌బాస్.. హత్యకు గురైన హౌస్‌మేట్స్‌!

బిగ్‌బాస్‌.. శ్రీముఖికి యాంకర్‌ రవి షాక్‌!

బిగ్‌బాస్‌.. భయపడే శ్రీముఖి అలా చేసిందట!

బిగ్‌బాస్‌కు వార్నింగ్‌ ఇచ్చిన పునర్నవి

అలీ రెజా ఇంట్లో విషాదం.. భావోద్వేగ పోస్ట్‌

అందరూ ఆమెనే టార్గెట్‌ చేశారా?

ఆ ముగ్గురు పునర్నవిని దూరం పెట్టారా?

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అలీ రీఎంట్రీ?

బాబా భాస్కర్‌ ఎవరిని సేవ్‌ చేయనున్నాడు?

అలీ అవుట్‌.. షాక్‌లో హౌస్‌మేట్స్‌

బిగ్‌బాస్‌.. అతను లేకుంటే షో చూడటం వేస్ట్‌!

బిగ్‌బాస్‌.. అడ్డంగా బుక్కైన శ్రీముఖి

బిగ్‌బాస్‌.. హోస్ట్‌గా నాని!

ప్రేమ విషయం బయటపెట్టిన పునర్నవి