రెట్టింపైన క్రేజ్‌; రాహుల్‌కు అవార్డు

8 Dec, 2019 13:46 IST|Sakshi

తెలంగాణ యాసతో పక్కింటి కుర్రాడిలా అనిపించే రాహుల్‌ సిప్లిగంజ్‌కు ప్రత్యేక గౌరవం దక్కింది. పలు రంగాల్లో విశేష సేవలందించే వ్యక్తులకు సాత్విక్‌ ఫైర్‌ సర్వీసెస్‌ పురస్కారాలను అందిస్తుంటుంది. శుక్రవారం రెడ్‌హిల్స్‌లోని ఫెడరేషన్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో సంగీత రంగంలో రాహుల్‌కు ‘రాష్ట్రీయ గౌరవ్‌ అవార్డు’ను అందించింది. ఈ కార్యక్రమంలో రాహుల్‌ తన పాటలతో అక్కడికి విచ్చేసిన జనాలను ఉర్రూతలూగించారు. కాగా బిగ్‌బాస్‌ తర్వాత రాహుల్‌ క్రేజ్‌ రెట్టింపైంది. చేతినిండా ప్రాజెక్ట్‌లతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఇక షోలో బద్ధ శత్రువుల్లా ఉన్న రాహుల్‌, శ్రీముఖి వారి గొడవలన్నీ షోలోనే వదిలేస్తాం అని చెప్పినప్పటికీ దాన్ని నిజం చేసిన దాఖలాలు లేవు.

ఇక బిగ్‌బాస్‌ రీయూనియన్‌ పార్టీకి పీవీవీఆర్‌(పునర్నవి,వితిక, వరుణ్‌, రాహుల్‌) బ్యాచ్‌లో రాహుల్‌ మిస్సవగా అటు శ్రీముఖి కూడా రాలేదు. ఆ తర్వాత రాహుల్‌.. తన చిచ్చాస్‌ (అభిమానుల) కోసం హైదరాబాద్‌లో లైవ్‌ కన్సర్ట్‌ ఏర్పాటు చేశాడు. దీనికి శ్రీముఖిని పిలుద్దామని కాల్‌ చేస్తే కనీస స్పందన కరువైంది. ఇక వీళ్లు కలవడం కష్టమేమో అన్న సమయంలో అందరికీ షాక్‌నిస్తూ రాహుల్‌, శ్రీముఖిలు కలిసిపోయారు. అసలైన రిలేషన్‌షిప్‌ ఇప్పుడు స్టార్ట్‌ అవుతుందంటూ కలిసి ఫొటోలకు ఫోజులిస్తూ డ్యాన్స్‌లు చేశారు. దీంతో వాళ్లిద్దరూ కలిసిపోయారోచ్‌ అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

శ్రీముఖి మాట మర్చిపోయిందా..
బిగ్‌బాస్‌ 3 తెలుగు షో కొతమందికే కలిసొచ్చినట్లు కనిపిస్తోంది. ఇందులో పాల్గొన్నవారిలో బాగా పాపులర్‌ కంటెస్టెంట్‌ శ్రీముఖి. కానీ ఈ భామ బిగ్‌బాస్‌ పాపులారిటీని షో తర్వాత సరిగా ఉపయోగించుకోలేకపోయిందని పలువురు అభిప్రాయపడ్డారు. బిగ్‌బాస్‌ పూర్తవగానే శ్రీముఖి ఎవరికీ చిక్కకుండా మాల్దీవులు వెళ్లిపోయి రిలాక్స్‌ అయింది. అక్కడ నుంచి రాగానే అభిమానులను కలుస్తానంటూ మాట కూడా ఇచ్చింది. తిరిగొచ్చి వారాలు గడుస్తున్నా ఇప్పటికీ దీనిపై పెదవి విప్పట్లేదు. దీంతో శ్రీముఖిపై ఆమె అభిమానులు కాస్త గుర్రుగా ఉన్నారు. రాహుల్‌ అభిమానుల కోసం లైవ్‌ కన్సర్ట్‌ ఏర్పాటు చేస్తే కనీసం శ్రీముఖి అభిమానులను కలవడానికి ఇంకా ఏదీ ప్లాన్‌ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక బిగ్‌బాస్‌ కోసం పటాస్‌ను వదిలేసిన శ్రీముఖి ఆ తర్వాత కూడా అటువైపు అడుగులు వేయదల్చుకోలేదు. అయితే ఈ మధ్యే ప్రారంభమైన ఓ మ్యూజిక్‌ ప్రోగ్రాంకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.
 

What an honour to receive “Rashtriya Gourav Award” in association with Department of Language and culture of Telangana for my contributions to music and arts. Thanks to all the Chichaas❤️ who supported me in this journey.. Everything I am, is because of you..!!

A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా