బిగ్‌బాస్‌: ‘రాహుల్‌ను గెలిపించండి’

31 Oct, 2019 16:05 IST|Sakshi

బిగ్‌బాస్‌ 3 టైటిల్‌ ఎవరు ఎగరేసుకుపోతారనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టైటిల్‌ రేసులో రాహుల్‌ సిప్లిగంజ్‌, శ్రీముఖి, బాబా భాస్కర్‌, అలీ రెజా, వరుణ్‌లు ఉన్నారు. అయితే ప్రధాన ఫైట్‌ మాత్రం రాహుల్‌, శ్రీముఖి మధ్యలోనే ఉంది. ఓట్లు వేయడానికి రేపు ఆఖరి రోజు కావటంతో అభిమానులు తమతమ ఫేవరెట్‌ కంటెస్టెంట్లకే ఓట్లు గుద్దండంటూ ప్రచారంతో సోషల్‌ మీడియాను ఊపేస్తున్నారు. ఓవైపు శ్రీముఖి ‘రాములమ్మ కాంటెస్ట్‌’తో ప్రేక్షకులను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. అది ప్రేక్షకులపై ఏపాటి ప్రభావం చూపిస్తుందో గ్రాండ్‌ ఫినాలేనాడు తేలనుంది. మరోపైపు రాహుల్‌ సిప్లిగంజ్‌ కోసం ప్రముఖ సింగర్‌ నోయెల్‌ గట్టి ప్రచారమే చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఇంకాస్త డోస్‌ పెంచుతూ రాహుల్‌ తల్లి రంగంలోకి దిగింది.

ఇంతకు మునుపు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వచ్చిన రాహుల్‌ తల్లి ఇంటి సభ్యులతోపాటు ప్రేక్షకుల మనసులనూ గెలుచుకుంది. హౌస్‌ను వీడి వెళ్లేముందు రాహుల్‌కు టాస్క్‌లు బాగా ఆడమని సూచించింది. అమ్మ మాట రాహుల్‌కు టాబ్లెట్‌లా పనిచేసిందేమో! తర్వాతి టాస్క్‌ల్లో తానేంటో నిరూపించుకుని టికెట్‌ టు ఫినాలే అందుకున్న ఫస్ట్‌ ఫైనలిస్టుగా నిలిచి రాహుల్‌.. అమ్మ మాట నిలబెట్టుకున్నాడు. మరి ఇప్పుడు ఏకంగా బిగ్‌బాస్‌ టైటిల్‌ కావాలని ఆమె రాహుల్‌ అభిమానులను కోరుతోంది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేసింది. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. రాహుల్‌ మంచితనం, నిజాయితీ, ముక్కుసూటి మాటలను మెచ్చి ఇక్కడిదాకా తీసుకొచ్చారు. మిగిలిన రెండురోజుల్లోనూ మీ ప్రేమను ఓట్ల రూపంలో చూపించి రాహుల్‌ను గెలిపించమని కోరింది. మరి చిచ్చా(రాహుల్‌) ఫ్యాన్స్‌ అమ్మ మాట నెరవేరుస్తారో లేదో చూడాలి!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నా జీవితంలో మర్చిపోలేనిది: శివజ్యోతి

ఆ ఇద్దరికే సపోర్ట్‌ చేస్తున్న బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు

బిగ్‌బాస్‌: వాళ్లకు సోషల్‌ మీడియా అంటే ఏంటో తెలీదు!

బిగ్‌బాస్‌ మనసు గెలుచుకున్న ఏకైక వ్యక్తి

ఆ రోజు నుంచి ‘బిగ్‌బాస్‌’ కనిపించదు..

బిగ్‌బాస్‌: గదిలో ఒంటరిగా ఏడుస్తున్న వరుణ్‌..

బిగ్‌బాస్‌: శ్రీముఖి కల నెరవేరబోతుంది

అడగకముందే అన్నీ ఇచ్చిన బిగ్‌బాస్‌.. రచ్చ రచ్చ!

బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలేకు మెగాస్టార్‌..!?

‘మా ఆయనే బిగ్‌బాస్‌ విజేత’

బిగ్‌బాస్‌: వరుణ్‌ను విజేతగా ప్రకటించిన సుమ

బిగ్‌బాస్‌: శ్రీముఖి కోసం డ్యాన్స్‌ పోటీలు!

బిగ్‌బాస్‌ : ‘పునర్నవి చేసింది ఎవరికీ తెలీదు’

బిగ్‌బాస్‌ ఇంట్లో సుమ రచ్చ రంబోలా..

బిగ్‌బాస్‌: దోస్తులతో శివజ్యోతి సంబరాలు!

బిగ్‌బాస్‌: బ్యాగు సర్దుకున్న మరో కంటెస్టెంట్‌

బిగ్‌బాస్‌: ‘శ్రీముఖి వల్ల అందరూ బలవుతున్నారు’

బిగ్‌బాస్‌: పెళ్లిపై స్పందించిన విజయ్‌ దేవరకొండ

షాకింగ్‌, రాహుల్‌ బండబూతుల వీడియో

బిగ్‌బాస్‌ : మరొకరికి టికెట్‌ టు ఫినాలే

‘అందుకే శ్రీముఖికి సపోర్ట్‌ చేయడం లేదు’

బిగ్‌బాస్‌ 3 గ్రాండ్ ఫినాలే!?

బిగ్‌బాస్‌: అర్థరాత్రి ‘బిగ్‌’ షాక్‌

బిగ్‌బాస్‌: లీకువీరుల కన్నా ముందే పసిగట్టారు!

జీవితంలో పెద్ద తప్పు చేశానన్న శివజ్యోతి..

శ్రీముఖి జీవితాన్ని కుదిపేసిన బ్రేకప్‌