బిగ్‌బాస్‌.. ఈ వారం ఎవరెవరు నామినేట్‌ అయ్యారంటే..?

19 Aug, 2019 23:15 IST|Sakshi

నామినేషన్‌ ప్రక్రియతో బిగ్‌బాస్‌ హౌస్‌ వేడెక్కింది. కెప్టెన్‌ అయిన అలీరెజాకు ప్రత్యేక అధికారాన్ని ఇవ్వడం.. నామినేషన్స్‌ కోసం నాలుగు పేర్లను ముందే ప్రకటించడం.. నామినేషన్‌ నుంచి తప్పించుకోవడం కోసం అలీరెజాను కాకాపట్టడం.. ఈ విషయంలో బాబా భాస్కర్‌ ఫన్‌ క్రియేట్‌ చేయడం.. హైలెట్‌గా నిలిచింది. అనంతరం ఐదో వారానికి సంబంధించిన నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కాబోతోన్నట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు. 

నామినేషన్‌ ప్రక్రియ కోసం హౌస్‌మేట్స్‌ అందరూ కోర్ట్‌ యార్డ్‌లో కూర్చున్నారు. వారి ముందు ఉన్న బాక్సులను సెలెక్ట్‌ చేసుకోవాలని.. అందులో బ్లాక్‌ బాల్‌ వస్తే ఎరుపు రంగు పూసి నామినేట్‌ చేయాలని, రెడ్‌ బాల్‌ వస్తే.. కన్ఫెషన్‌ రూమ్‌కు వచ్చి నామినేట్‌ చేయాలనుకుంటున్న ఇద్దరి పేర్లు చెప్పాలని బిగ్‌బాస్‌ తెలిపాడు. దీంతో వితికా, శ్రీముఖి, రాహుల్‌, శివజ్యోతిలు కన్ఫెషన్‌ రూమ్‌కు వెళ్లి నామినేట్‌ చేశారు. మహేష్‌, అషూలను వితికా.. రాహుల్‌, అషూలను శ్రీముఖి.. హిమజ, శ్రీముఖిలను రాహుల్‌.. పునర్నవి, రాహుల్‌ను శివజ్యోతి నామినేట్‌చేస్తున్నట్లు బిగ్‌బాస్‌కు తెలిపారు.

మిగతా సభ్యులకు బ్లాక్‌ బాల్‌ రావడంతో కోర్ట్‌ యార్డ్‌లోనే ఎరుపు రంగును పూసి నామినేట్‌ చేశారు. హిమజ, రాహుల్‌ పునర్నవిని నామినేట్‌ చేస్తూ.. రాహుల్‌ గేమ్‌ను లైట్‌గా తీసుకుంటున్నాడని, హిమజ చెప్పింది వినకుండా వాదిస్తూ ఉంటుందనే కారణాలు చెప్పుకొచ్చింది. ఇక వరుసబెట్టి మిగతా హౌస్‌మేట్స్‌ అదే కారణం చెప్పి రాహుల్‌ను నామినేట్‌ చేస్తూ వచ్చారు. రాహుల్‌, అషూను బాబా భాస్కర్‌.. రాహుల్‌, హిమజలను అషూ.. హిమజ, రాహుల్‌ను అషూ.. రాహుల్‌, మహేష్‌లను వరుణ్‌.. రాహుల్‌, వరుణ్‌లను మహేష్‌.. పునర్నవి, అషూలను హిమజ నామినేట్‌ చేసింది. ఈ ప్రాసెస్‌లో పునర్నవి, అషూలతో హిమజకు పెద్ద వాగ్వాదం జరిగింది. 

కంటతడి పెట్టిన బాబా భాస్కర్‌
కెప్టెన్‌ అయినందుకు అలీరెజాకు ప్రత్యేక అధికారాన్ని ఇచ్చాడు బిగ్‌బాస్‌. నేరుగా ఓ హౌస్‌మేట్‌ను నామినేట్‌ చేసే అధికారాన్ని ఇస్తూ.. అందుకు గానూ ముందుగా ఓ నలుగురు ఇంటి సభ్యుల పేర్లు చెప్పాలని తెలిపాడు. దీంతో రాహుల్‌, హిమజ, వితిక, బాబా భాస్కర్‌ల పేర్లను బిగ్‌బాస్‌కు తెలిపాడు. అయితే ఆ నలుగురు అలీరెజాను ఒప్పించి.. నామినేషన్‌ నుంచి తప్పించుకోవచ్చు అనే మెలిక పెట్టాడు. ఇక బాబా భాస్కర్‌ తనను నామినేషన్‌ నుంచి తప్పించమని అలీరెజా వెంటపడ్డాడు. అయితే తను గేమ్‌ను సీరియస్‌గా తీసుకోవడం లేదని బాబాకు అలీరెజా సూచించాడు. అయితే తాను సీరియస్‌గా ఉండడానికి ప్రయత్నిస్తానంటూ అలీతో బాబా చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పటివరకు నామినేట్‌ కాని సభ్యుల పేర్లు చెప్పమని అలీరెజాకు బిగ్‌బాస్‌ సూచించగా.. బాబా భాస్కర్‌ను నామినేట్‌ చేస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో ఈ వారానికి రాహుల్‌, హిమజ, అషూ, మహేష్‌, పునర్నవి, శివజ్యోతి, బాబా భాస్కర్‌లు నామినేట్‌ అయినట్లు ప్రకటించాడు.

తనను నామినేట్‌ చేస్తున్నట్లు, తన పేరు చెప్పగానే బాబా భాస్కర్‌ కంట్లో నీళ్లు తిరిగినట్టు అనిపించాయి. ఇక నామినేషన్‌ విషయంలో తనను అలీరెజా మోసం చేశాడని బాబా భాస్కర్‌ శ్రీముఖితో చెప్పుకొని కన్నీరు పెట్టుకున్నాడు. అతను చెప్పాడనే సైలెంట్‌గా ఉన్నానని కానీ చివరకు తననే నామినేట్‌ చేశాడని పేర్కొన్నాడు. వెనకాలే ఉంటూ నమ్మక ద్రోహం చేస్తే తాను తట్టుకోలేనని, ఇక్కడికి ఆట ఆడటానికి రాలేదంటూ బాధపడ్డాడు. నామినేషన్స్‌కు బాబ భాస్కర్‌ భయపడంటూ తనలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేసింది శ్రీముఖి. ఇక రేపటి ఎపిసోడ్‌లో పంతం నీదా నాదా? అనే కెప్టెన్సీ టాస్క్‌లో ఎవరు గెలుస్తారో? బిగ్‌బాస్‌ ఇంటికి మూడో కెప్టెన్‌గా ఎవరు ఎన్నికవుతారో చూడాలి. 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి
 

మరిన్ని వార్తలు