పునర్నవిపై బిగ్‌బాంబ్‌ వేసిన రవి

29 Sep, 2019 22:40 IST|Sakshi

సండేను ఫండేగా మార్చేందుకు నాగార్జు వచ్చేశాడు. వీకెండ్‌లో వచ్చిన నాగ్‌.. ఇంటి సభ్యులందరితో ఫన్నీ టాస్క్‌ ఆడించాడు. కంటెస్టెంట్లందర్నీ జంటలు విడగొట్టి.. ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేయాల్సిందిగా కోరాడు. బిగ్‌బాస్‌ టీవీ ఉంటుందని.. ఏ కంటెంట్‌ అయిన వాడుకుని అందర్నీ నవ్వించాలని ఆదేశించాడు. దీనిలో భాగంగా మొదటగా వచ్చిన మహేష్‌-శివజ్యోతి.. బిగ్‌బాస్‌ ముచ్చట్లను ప్రేక్షకులకు వినిపించారు. పును-రాహుల్‌ మధ్య రిలేషన్‌, ఈ వారంలో జరిగిన సంఘటనలపై బులిటెన్‌లా వినిపించారు. చివరగా ఇద్దరూ వారి విషయాలను కూడా వారు ఫన్నీగా చెప్పుకొచ్చారు.

అలీ-వితికాలు.. అమాయకపు భర్త, అనుమానపు భార్య పాత్రలను పోషించి..చిన్న స్కిట్‌ వేశారు. రవి-వరుణ్‌లో రవి ఇంటర్వ్యూ చేసే వ్యక్తిగానూ.. బిగ్‌బాస్‌ నుంచి ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్‌గా వరుణ్‌ నటించారు. ఇంటర్య్యూలో భాగంగా రవి అడిగిన ప్రశ్నలకు వరుణ్‌గా సరదాగా జవాబులు చెప్పాడు. అనంతరం బాబా భాస్కర్‌-శ్రీముఖి డ్యాన్స్‌ రియాల్టీ షో ఎలా జరగుతుందో స్కిట్‌రూపంలో చూపించారు. ఆ షోకు రవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. చివరగా రాహుల్‌.. ఇంటిసభ్యులందరిపై పేరడీ సాంగ్‌ పాడగా.. రాహుల్‌పై  పునర్నవి సైతం ఫన్నీ లిరిక్స్‌తో అదరగొట్టింది.

కిస్‌ అండ్‌ కిల్‌ అంటూ ఆడించిన నాగ్‌...
హౌస్‌లో ఎవరు ఉండాలనుకుంటున్నారో.. వారికి కిస్ అని , ఎలిమినేట్‌ కావాలని అనుకునేవారికి కిల్‌ అంటూ కత్తిపోటును దించాలనే టాస్క్‌ ఇచ్చాడు. దీనిలో భాగంగా వరుణ్‌-రాహుల్‌ వారి మధ్య జరిగిన గొడవను మరిచిపోయినట్లు కనిపిస్తోంది. వారిద్దరు కిస్‌ అని ఇచ్చుకున్నారు. అయితే అనూహ్యంగా పున్నును ఎలిమినేట్‌ చేయాలని వరుణ్‌ పేర్కొన్నాడు. టాస్క్‌లు సరిగా ఆడదని అందుకే కిల్‌ అనే ఆప్షన్‌ ఎంచుకున్నట్లు తెలిపాడు. అలీ.. బాబాకు, బాబా.. అలీకి కిల్‌ అనే ఆప్షన్‌ ఇచ్చుకున్నారు. ఈ టాస్క్‌ అనంతరం రవి ఎలిమినేట్‌ అయినట్లు నాగ్‌ ప్రకటించాడు.

చేదు లడ్డూలు.. తీపి లడ్డూలు
ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉన్న పొజిషన్‌లో కంటెస్టెంట్ల పేరు చెప్పమని రవికి టాస్క్‌ ఇచ్చాడు. ఒకటి నుంచి ఐదు వరకు ఉన్నవారికి తీపి లడ్డూలు, ఆరు నుంచి తొమ్మిది వరకు ఉన్నవారికి చేదు లడ్డూలు తినాలనే టాస్క్‌ ఇచ్చాడు. అయితే పున్ను(9), వితికా(8), మహేష్‌(7), రాహుల్‌ (6) పొజిషన్స్‌లోపెట్టడంతో వారు చేదు లడ్డూలను రుచి చూడవల్సి వచ్చింది. బాబా(5), శ్రీముఖి(4), వరుణ్‌(3), అలీ(2), శివజ్యోతి(1) ఇవ్వడంతో వారంతా తీపి లడ్డూలను రుచి చూశారు. ఇంటి సభ్యులందరి బట్టలను ఉతకాలనే బిగ్‌బాంబ్‌ను పునర్నవిపై వేశాడు. ఇక పదకొండో వారంలో ఎలాంటి ఘటనలు జరగనున్నాయో చూడాలి.

Poll
Loading...
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు