జీవితంలో పెద్ద తప్పు చేశానన్న శివజ్యోతి..

25 Oct, 2019 11:30 IST|Sakshi

టాప్‌ 5కు వెళ్లే అర్హత శ్రీముఖికి ఉందని తేలడం, ఇంటి సభ్యులు... వారి జీవితంలో చోటు చేసుకున్న చేదు ఘటనలను చెప్తూ ఎమోషనల్‌ అవడం నేటి ఎపిసోడ్‌లో హైలెట్‌గా నిలిచింది. ముందుగా వారికి హౌ క్లీన్‌ యువర్‌ జర్నీ అనే టాస్క్‌ ఇచ్చారు. అందులో భాగంగా ఇంటి సభ్యులందరికీ ఒక్కొక్కరి పేరు రాసున్న రంగు బౌల్స్‌ను ఇచ్చారు. ఆ పేర్లు ఉన్న వ్యక్తులు టాప్‌ 5కు ఎందుకు అనర్హులు కాదో చెప్పి రంగు పోయాల్సి ఉంటుందని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. మొదటగా బాబా భాస్కర్‌.. అలీ తన గురించి మాట్లాడిన విషయాలు బాధపెట్టాయంటూ అలీపై రంగు పోశాడు. తర్వాత శ్రీముఖి.. శివజ్యోతి ఎమోషనల్‌ వ్యక్తి.. కాబట్టి తను ఫైనలిస్టుకు అర్హురాలు కాదంటూ ఆమెపై రంగు గుమ్మరించింది. ఇక శివజ్యోతి... కోపంలో వరుణ్‌ మాట్లాడిన విధానం నచ్చలేదంటూ అతడిని అనర్హుడిగా తేల్చింది. అమ్మాయిలకు రెస్పెక్ట్‌ ఇవ్వడంటూ వరుణ్‌పై రంగు చల్లింది.

టాప్‌ 5కు వెళ్లే అర్హత శ్రీముఖికి..

అయితే బాబా టాప్‌ 5లో ఉండేందుకు బాబా అర్హుడంటూ వరుణ్‌ రంగు పోయడానికి నిరాకరించాడు. అటు బాబా కూడా శ్రీముఖి ఫైనల్‌కు వెళ్లేందుకు తగిన వ్యక్తి అని రంగు చల్లడానికి ఒప్పుకోలేదు. చాలాసేపు తటాపటాయించిన అనంతరం వరుణ్‌ రంగు చల్లడానికి సిద్ధపడ్డాడు. వితిక వెళ్లిపోయినప్పటి నుంచి తనను ప్రేమగా చూసుకున్నావంటూ పాజిటివ్‌ దృక్పథంలో బాబాపై రంగు గుమ్మరించాడు. ఇక బాబా.. తనపై రంగు పడకుండా గెంతులు వేశాడు. కాగా రంగు పడకుండా క్లీన్‌గా నిలిచిన శ్రీముఖి విన్నర్‌గా నిలవగా.. తనకోసం ప్రచారం చేసుకునే అవకాశాన్ని గెలుచుకుంది.  ఓట్లు వేసిన వారికి జీవితాంతం రుణపడి ఉంటానని, తనను గెలిపించమని శ్రీముఖి ప్రేక్షకులను కోరింది.

జీవితంలో చీకటి రోజులు..
అనంతరం బిగ్‌బాస్‌ మీ జీవితంలో జరిగిన చీకటి విషయాలను చెప్పుకోండి అని హౌస్‌మేట్స్‌ను ఆదేశించాడు. తొలుత మాట్లాడటానికి వచ్చిన వరుణ్‌.. అమ్మాయిని వేధిస్తున్నవారిని చితక్కొట్టి ఆ అమ్మాయిని కాపాడామని, అనంతరం అక్కడి నుంచి తప్పించుకున్నామని చెప్పాడు. శివజ్యోతి తన జీవితంలో జరిగిన చేదు ఘటనను చెప్తూ మళ్లీ పాతాళ గంగలా మారింది. నాన్న చనిపోయినా కూడా రెండు రోజుల వరకూ ఆ విషయాన్ని దాచారని.. తండ్రి కోసం తెచ్చిన ఆహారాన్ని అన్నయ్య తినేసి నాన్నే తిన్నాడని చెప్పి నమ్మించేవాళ్లని ఎమోషనల్‌ అయింది. మానసికంగా నన్ను సిద్ధంగా ఉంచటం కోసం వాళ్లు అవన్నీ చేశారు. అయితే తండ్రికి చికిత్స అందించడానికి ఆలస్యం చేసామని శివజ్యోతి కుమిలిపోయింది. ‘నాన్న ట్రీట్‌మెంట్‌కు నేను, మా ఆయన రెండు రోజులు ముందుగా ఆసుపత్రికి తీసుకెళ్లుంటే బతికేవాడేమో’ అని చెప్తూ కన్నీటి పర్యంతం అయింది. ఇది తన జీవితంలోనే చేసిన పెద్ద తప్పు అంటూ శివజ్యోతి బాధపడింది.

బ్రేకప్‌... చచ్చిపోదామనుకున్నా: శ్రీముఖి

అనంతరం శ్రీముఖి మాట్లాడుతూ.. ‘అందరు అమ్మాయిల లాగే నా జీవితంలోనూ రిలేషన్‌షిప్స్‌ ఉండేవి. అతనితో అంతా బాగుంది అనుకున్న సమయంలో డిస్టబెన్స్‌ ఎదురయ్యాయి. ఓ రోజు ఆకస్మాత్తుగా స్టేజీపై యాంకరింగ్‌ చేస్తున్నపుడు నాకు బ్రేకప్‌ అయిపోయిందన్న వార్త వచ్చింది. నేను పక్కకు వెళ్లి ఏడుస్తూనే ఉన్నాను. ఆ సమయంలో చచ్చిపోవాలనిపించింది. అవన్నీ పక్కనపెట్టి.. అప్పుడు నేను చేస్తున్న కామెడీ షోను నవ్వుతూనే పూర్తి చేశాను. బ్రేకప్‌ తర్వాత చాలా ఒంటరిగా ఫీల్‌ అయ్యాను.  కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఎందుకు ఆ విషయం కోసం అంత ఫూలిష్‌గా ప్రవర్తించాను అనిపిస్తుంది. సో.. ఒక అమ్మాయి ఆర్థికంగా ఎదిగిన తర్వాతే లవ్వు, గివ్వు వంటివాటి కోసం ఆలోచించండి. ఫ్యామిలీ తర్వాతే మిగతా వాటిని పట్టించుకోండి’ అని సలహా ఇచ్చింది. అయితే ఆమె జీవితంలో కల్లోలాన్ని సృష్టించిన వ్యక్తి పేరును మాత్రం చెప్పుకోడానికి ఇష్టపడలేదు. ఆ వ్యక్తి తనకు తెలుసంటూ అలీ హింట్‌ ఇవ్వగా శ్రీముఖి కాదని చెప్పింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు