బిగ్‌బాస్‌: శివజ్యోతిని హెచ్చరించిన భర్త!

16 Oct, 2019 12:25 IST|Sakshi

బిగ్‌బాస్‌ ఇచ్చిన ఫన్నీ టాస్క్‌ ఎమోషనల్‌గా మారుతోంది. బిగ్‌బాస్‌ హోటల్‌ నిర్వహణ ఆధారంగానే ఇంట్లోకి అతిథులను పంపిస్తానని బిగ్‌బాస్‌ తేల్చి చెప్పాడు. అయితే ఆ అతిథులు హౌస్‌మేట్స్‌ కుటుంబ సభ్యులే కావటం విశేషం. ఇప్పటికే వితిక చెల్లెలు రితికా ఇంట్లోకి వచ్చి సందడి చేసి వెళ్లిన విషయం తెలిసిందే! వెళ్లిపోతూ వారిద్దరికీ తగు సూచనలు ఇచ్చి వీడ్కోలు పలికింది. బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులను స్లీప్‌ మోడ్‌లో ఉండమని ఆదేశించిన సమయంలో అలీ భార్య మసుమా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. వచ్చీరాగానే అలీని తన ఒడిలోకి తీసుకుని కన్నీళ్లు కార్చింది.

ఇక నేటి ఎపిసోడ్‌లో మరింత మంది అతిథులు రానున్నారు. శివజ్యోతి భర్త గంగూలీని చూడగానే శివజ్యోతికి ప్రాణం లేచి వచ్చినట్టయింది...ఆనందంతో ఆమె కళ్ల వెంబడి కన్నీళ్లు ధారలు కట్టాయి. ‘నువ్వు ఏడిస్తే నేను వెళ్లిపోతా..’ అంటూ గంగూలీ.. శివజ్యోతిని ఏడవద్దంటూ సుతిమెత్తగా హెచ్చరించాడు. ఇన్ని వారాల ఎడబాటును భరించలేకున్నానంటూ ఆమె ఒక్కసారిగా అతని కౌగిలిలో బందీ అయిపోయింది. ఇక మళ్లీ ఈ అవకాశం రాదని గ్రహించిన శివజ్యోతి మనసారా అతనితో ముచ్చట్లాడింది.  అన్ని రకాల బాధలను వదిలేసి మనసును తేలిక చేసుకున్నట్లు కనిపిస్తోంది. మిగిలిన ఇంటి సభ్యులు.. తమవాళ్లు ఎవరెవరు వస్తారోనని ఎదురు చూస్తున్నారు.

మరిన్ని వార్తలు