బిగ్‌బాస్‌: బ్యాగు సర్దుకున్న మరో కంటెస్టెంట్‌

27 Oct, 2019 16:58 IST|Sakshi

బుల్లితెర బిగ్గెస్ట్‌ రియాలిటీ షో బిగ్‌బాస్‌ 3 తెలుగు సీజన్‌ నేటితో పద్నాలుగు వారాలు పూర్తి చేసుకోనుంది. పదిహేను మందితో ప్రారంభమైన ఈ  బిగ్‌బాస్‌ సీజన్‌లో రెండు వెల్డ్‌కార్డ్‌ ఎంట్రీలు కూడా ఉండటంతో ఇంటి సభ్యుల సంఖ్య పదిహేడుకు చేరింది. ఇప్పటివరకు 11 మంది హౌస్‌ను వీడగా ఆరుగురు కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. ఈ ఆరుగురిలో ఇప్పటికే రాహుల్‌, బాబా భాస్కర్‌, శ్రీముఖిలు టికెట్‌ టు ఫినాలే దక్కించుకుని టాప్‌ 5లోకి అడుగు పెట్టారు. వరుణ్‌, అలీ రెజా, శివజ్యోతి నామినేషన్‌లో కొనసాగుతున్నారు. 

అయితే, వరుణ్‌కు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ బాగానే ఉండటంతో అతను సేఫ్‌ జోన్‌లోనే ఉంటాడనే వార్తలు వస్తున్నాయి. ఇక అక్కాతమ్ముళ్లు శివజ్యోతి, అలీరెజా మాత్రం డేంజర్‌ జోన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. వైల్డ్‌ కార్టుతో రీఎంట్రీకి అలీకి విపరీతమైన ఫాలోయింగ్‌ ఉండేది. కానీ, అదిప్పుడు పూర్తిగా పడిపోయింది. రీ ఎంట్రీ అనేది అలీకి పెద్ద మైనస్‌గా మారింది. బయట పరిస్థితులు, బిగ్‌బాస్‌కు సంబంధించి గేమ్‌ ప్లాన్లు తెలుసుకుని వచ్చాడని అందరూ అలీనీ పక్కన పెట్టేశారు. దీంతో ఎలిమినేషన్‌ తప్పించుకోవడానికి అలీకి ఈ సారి తక్కువ ఓట్లే పడ్డాయి.

కానీ అతని కన్నా తక్కువ ఓట్లతో శివజ్యోతి చిట్ట చివరి స్థానంలో ఉంది. గత కొన్ని వారాలుగా శివజ్యోతి ప్రవర్తన నచ్చట్లేదంటూ నెటిజన్లు ఆమెను పంపిచడానికి సిద్ధమైపోయారు. ఏడుపు అనేది ఒక ఎమోషన్‌ అని చెప్పిన శివజ్యోతి మాటలను ప్రేక్షకులు పట్టించుకోలేదు. తన సాగదీత సమాధానాలు సైతం ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. వరుణ్‌, వితికలతో గొడవ కూడా ఓట్లకు గండి కొట్టింది. టాస్క్‌లు బాగానే ఆడినప్పటికీ అదొక్కటే టైటిల్‌ అందుకోడానికి సరిపోదనేది ఈమె విషయంలో అర్థమవుతోంది. దీంతో నేడు శివజ్యోతి ఎలిమినేట్‌ కానున్నట్టు సమాచారం. ఈ సీజన్‌లో ఇదే చివరి ఎలిమినేషన్‌ కాగా రేపటి నుంచి అయిదుగురు హౌస్‌మేట్స్‌ మధ్య ఫైనల్‌ పోరు జరుగనుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌ :‘శ్రీముఖి వల్ల అందరూ బలవుతున్నారు’

బిగ్‌బాస్‌: పెళ్లిపై స్పందించిన విజయ్‌ దేవరకొండ

షాకింగ్‌, రాహుల్‌ బండబూతుల వీడియో

బిగ్‌బాస్‌ : మరొకరికి టికెట్‌ టు ఫినాలే

‘అందుకే శ్రీముఖికి సపోర్ట్‌ చేయడం లేదు’

బిగ్‌బాస్‌ 3 గ్రాండ్ ఫినాలే!?

బిగ్‌బాస్‌: అర్థరాత్రి ‘బిగ్‌’ షాక్‌

బిగ్‌బాస్‌: లీకువీరుల కన్నా ముందే పసిగట్టారు!

జీవితంలో పెద్ద తప్పు చేశానన్న శివజ్యోతి..

శ్రీముఖి జీవితాన్ని కుదిపేసిన బ్రేకప్‌

బిగ్‌బాస్‌ నిర్వాహకుల అనూహ్య నిర్ణయం

వరుణ్‌, శివజ్యోతిల ఫైట్‌ మళ్లీ మొదలైంది..

శ్రీముఖి కోసం ప్రచారం చేస్తున్న టాప్‌ యాంకర్‌

చిచ్చా గెలుపు.. ప్రతీకారం తీర్చుకుంటున్న ఫ్యాన్స్‌

బిగ్‌బాస్‌ ఇంట్లో సర్కస్‌, నేడే చూడండి!

బిగ్‌బాస్‌: ఫైనల్‌కు రాహుల్‌, అలీకి బిగ్‌ షాక్‌

బిగ్‌బాస్‌: అలీని చూసి వణికిపోతున్న హౌస్‌మేట్స్‌

బిగ్‌బాస్‌: బాబాపై ప్రతాపాన్ని చూపిస్తున్న అలీ..

ఏదైనా రాజకీయాలు జరిగితే శ్రీముఖి విన్నర్‌ కావొచ్చు..

రాహుల్‌ది ఫేక్‌ రిలేషన్‌షిప్‌ : వితికా

బిగ్‌బాస్‌: ఫైనల్‌కు వెళ్లే ఆ ఒక్కరు ఎవరు?

బిగ్‌బాస్‌: వితికను పట్టుకుని ఏడ్చేసిన వరుణ్‌

బిగ్‌బాస్‌పై శివ బాలాజీ షాకింగ్‌ కామెంట్స్‌!

బిగ్‌బాస్‌: ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌..!

బిగ్‌బాస్‌: ఆ ముగ్గురు సేఫ్‌..!

బిగ్‌బాస్‌: వితికా ఎలిమినేట్‌.. ఇది ఫిక్స్‌!

బిగ్‌బాస్‌: ఈసారి ‘ఆమె’ ఎలిమినేట్‌ అవుతుందా?