బిగ్‌బాస్‌: పిల్లికి బిచ్చం వేయని శివజ్యోతి

24 Sep, 2019 12:09 IST|Sakshi

పదోవారానికి గాను జరిగిన ఎలిమినేషన్‌ ప్రక్రియతో ఇంటి సభ్యుల మధ్య చిచ్చు పెట్టిన బిగ్‌బాస్‌.. నేడు వారికి ఫన్నీ టాస్క్‌ ఇచ్చి కూల్‌ చేయనున్నాడు. కాగా ఎలిమినేషన్‌ ప్రక్రియలో శ్రీముఖి- శివజ్యోతిలు హోరాహోరీగా వాదులాడుకోగా వరుణ్‌- రాహుల్‌ కూల్‌గా చర్చించుకున్నారు. పదో వారానికిగానూ రవి, వరుణ్‌, బాబా భాస్కర్‌, శ్రీముఖిలు నామినేట్‌ అయ్యారు. అయితే ఈ నలుగురులో కాస్త బలహీనంగా ఉన్న రవి డేంజర్‌ జోన్‌లో ఉన్నాడని ఇట్టే తెలిసిపోతుంది. ఇక నామినేషన్‌ ప్రక్రియ పూర్తయి ఒక్కరోజైనా గడిచిందో లేదో అప్పుడే రవి ఎలిమినేట్‌ అవుతాడంటూ సోషల్‌మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.

నేటి ఎపిసోడ్‌లో బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులకు ఫన్నీ టాస్క్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. తరిగిపోనంత ఆస్తులున్నా పిల్లికి బిచ్చం వేయని మహా పిసినారిగా శివజ్యోతి కనిపించనుంది. ఆమెకు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్లు ఉంటారు. శివజ్యోతి వ్యవహారాలు చూసుకోడానికి మేనేజర్‌గా బాబా భాస్కర్‌ను నియమించారు. ఇక ఈ టాస్క్‌లో అతి వినియంతో శ్రీముఖి శివజ్యోతి కాళ్లు పట్టుకుంది. బాబా భాస్కర్‌ వెటకారం, శివజ్యోతి చమత్కారం వెరసి ఈ ఎపిసోడ్‌ జనాలకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవ్వనున్నట్లు కనిపిస్తోంది. మరి నేటి ఎపిసోడ్‌లో ఇంటిసభ్యులు ఎంత హంగామా చేయనున్నారో చూడాలి!

Poll
Loading...
మరిన్ని వార్తలు