బిగ్‌బాస్‌: ఓడిపోయినా కోరిక నెరవేర్చుకుంది!

10 Nov, 2019 10:52 IST|Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3 ముగిసి వారం గడిచింది. కంటెస్టెంట్ల పార్టీలు, ఇంటర్వ్యూలు రోజుకొకచోట జరుగుతూనే ఉన్నాయి. అయితే, రన్నరప్‌గా నిలిచిన శ్రీముఖి మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. బిగ్‌బాస్‌ పూర్తికాగానే ఆమె ఎంచక్కా మాల్దీవుల టూర్‌కు వెళ్లిపోయింది. సముద్ర తీరంలో తన ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్‌ చేస్తోంది. ఈ ట్రిప్‌లో ఆర్జే చైతూ, యాంకర్‌ విష్ణుప్రియ కూడా ఉన్నారు. ఇక  బిగ్‌బాస్‌ షో జరుగుతున్న సమయంలో హోస్ట్‌ నాగార్జున ఓ సందర్భంలో శ్రీముఖిని.. ‘మీరు బిగ్‌బాస్‌ విన్నర్‌గా నిలిచి రూ.50 లక్షలు మీ సొంతమైతే.. ఏం చేస్తారు’ అని ప్రశ్నించగా.. అన్నీ పేరెంట్స్‌కు ఇస్తానని సమాధానమిచ్చింది. అంతేగాక తనకెంతో ఇష్టమైన మాల్దీవులకు వెళ్తానని శ్రీముఖి చెప్పుకొచ్చింది.

కానీ, ఆమె రన్నరప్‌తోనే సరిపెట్టుకున్నా.. మాల్దీవులకు వెళ్లి తన కోరిక నెరవేర్చుకుంది. తన ఫ్రెండ్స్‌తో కలిసి మాల్దీవుల్లో ఆమె చేస్తున్న సందడిని ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి అభిమానులను పలకరిస్తోంది. ఏదేమైనా బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్న 105 రోజులు శ్రీముఖి చలాకీగా, దూకుడుగా ఉంటూ అందరినీ ఆకర్షించింది. టాస్క్‌ల్లోనూ విజృంభించి మిగతా హౌస్‌మేట్స్‌కు గట్టిపోటీనిచ్చింది. కానీ, షో చివరి రోజుల్లో రాహుల్‌ అనూహ్యంగా పుంజుకోవటంతో ఆమె రెండోస్థానంలో నిలిచింది. ఇక, విన్నర్‌గా నిలవలేకపోయినందుకు శ్రీముఖి బాధపడినా.. పలువురు సెలబ్రిటీలు, అభిమానులు ఆమెకు మద్దతుగా నిలవడం కాస్త ఊరటనిచ్చింది.

A post shared by Sreemukhi (@sreemukhi) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌ ట్రోఫీ, మనీ వద్దు: శ్రీముఖి

మంత్రిని కలిసిన రాహుల్‌ సిప్లిగంజ్‌

ఆ స్వార్థంతోనే బిగ్‌బాస్‌ షోకు వచ్చా: జాఫర్‌

ప్రేమలో పడ్డాను.. పేరు చెప్పలేను: రాహుల్‌

త్వరలో పున్నుతో లైవ్‌లోకి వస్తా: రాహుల్‌

అది టెలికాస్ట్‌ చేయలేదు: బాబా భాస్కర్‌

టైటిల్‌ చేజారినా శ్రీముఖికి భారీ పేచెక్‌..

బిగ్‌బాస్‌ ఫలితంపై యాంకర్‌ ఝాన్సీ అసహనం

వాళ్లకిష్టమైతే పెళ్లి చేస్తాం: రాహుల్‌ పేరెంట్స్‌

బిగ్‌బాస్‌ ఫలితంపై స్పందించిన కత్తి మహేశ్‌

బిగ్‌బాస్‌: శ్రీముఖి కొంపముంచిన ‘టాటూ’

రాహుల్ గెలుపును తప్పుబట్టిన శ్రీముఖి

బిగ్‌బాస్‌: శ్రీముఖి ఓటమికి కారణాలు ఇవే..

అక్కడ జాగ్రత్త పడుంటే బిగ్‌బాస్‌ హిట్‌ అయ్యేదే..!

బిగ్‌బాస్‌: రాహుల్‌ గెలుపునకు కారణాలివే..

బిగ్‌బాస్‌ : ‘మిడిల్‌ క్లాస్‌ వ్యక్తిని గెలిపించారు’

బిగ్‌బాస్‌: ఒక్క పైసా కూడా ఇవ్వలేదు

బిగ్‌బాస్‌–3 విజేత రాహుల్‌

బిగ్‌బాస్‌: బాబా ఔట్‌.. విజేత ఎవరంటే!

బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలిచినా భవిష్యత్తు అంధకారమే!

గ్రాండ్‌ ఫినాలే: ఎలిమినేట్‌ అయింది ఎవరు?

‘షూటింగ్‌ అయినా మానేస్తా.. బిగ్‌బాస్‌ కాదు’

బిగ్‌బాస్‌ చివరి రోజు: మహేశ్‌ హర్ట్‌ అయ్యాడు

ఆ వార్తలు నమ్మకండి : నాగార్జున

బిగ్‌బాస్‌ : 50 లక్షలు ఎవరివి?

బిగ్‌బాస్‌: లెక్క తేలింది. రాహుల్‌ గెలిచాడు!

బిగ్‌బాస్‌ ఇంట్లో ఆఖరి మజిలీ, అదిరిపోలా!

శ్రీముఖి విన్నర్‌ కాదంటున్న ఆమె తమ్ముడు