బిగ్‌బాస్‌.. భయపడే శ్రీముఖి అలా చేసిందట!

10 Sep, 2019 18:35 IST|Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో రాహుల్‌-శ్రీముఖిల మధ్య మొదటి వారం నుంచి మొదలైన ఈ వైరం ఎన్నటికి ముగుస్తుందో అన్నది ప్రశ్నార్థకం. బయట ఉన్న శ్రీముఖికి బిగ్‌బాస్‌లో ఉన్న శ్రీముఖికి చాలా తేడా ఉందని.. బయట తనకు క్లోజ్‌ ఫ్రెండ్‌ అని రాహుల్‌ చెబుతూ ఉంటాడు. ఇక రాహుల్‌ చేసే పనులు, మాట్లాడే మాటలు తనకు నచ్చవని శ్రీముఖి ఫిర్యాదు చేస్తూ ఉంటుంది. తనను అసభ్యకరంగా దూషించాడని, తన వృత్తిని అవమానించాడని రాహుల్‌పై కోపం పెంచుకుంది. వీరిమధ్య క్షమాపణల పర్వం జరుగుతూనే ఉన్నా.. దూరం మాత్రం తగ్గడం లేదు. 

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నంతకాలం నామినేట్‌ చేస్తానని ప్రతిజ్ఞ చేసిన శ్రీముఖి.. ఈవారం షాక్‌ ఇచ్చింది. అందరూ రాహుల్‌ను నామినేట్‌ చేస్తానని అనుకుంటారు కానీ.. ఈ వారం చేయట్లేదు అంటూ షాక్‌ ఇచ్చింది. అయితే రాహుల్‌ మాత్రం శ్రీముఖినే నామినేట్‌ చేశాడు. అయితే ఇదే విషయం ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చకు దారి తీసింది. నామినేషన్‌లో ఉన్న ప్రతీసారి రాహుల్‌ సేవ్‌ అవుతూనే వస్తున్నాడని.. అతనికి ఫాలోయింగ్‌ పెరిగిందని.. అందుకే భయపడి నామినేట్‌ చేయలేదని రాహుల్‌ అభిమానులు  కామెంట్లు చేస్తున్నారు. అయితే వీటికి ప్రతిస్పందనగా.. శ్రీముఖి ఫాలోవర్స్‌ కూడా కౌంటర్లు వేస్తున్నారు. నామినేట్‌ చేస్తే టార్గెట్‌ చేసిందంటారు.. చేయకపోతే భయపడిందని అంటారని కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా.. రాహుల్‌కు రోజురోజుకూ ఫాలోయింగ్‌ పెరుగుతుందనేది మాత్రం నిజం. తన నోటి దురుసును కాస్త తగ్గించుకుని, టాస్క్‌లో ఇంకా యాక్టివ్‌గా పార్టిసిపేట్‌ చేస్తే తనకు ఎదురులేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. బిగ్‌బాస్‌ మూడో సీజన్‌కు వీరద్దరి మధ్య జరిగే వార్‌ హైలెట్‌గా నిలవనుంది. వీరిద్దరిలో చివరి వరకు ఎవరు నిలబడుతారో చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌.. రవిని బురిడీ కొట్టించిన బాబా

బిగ్‌బాస్.. హత్యకు గురైన హౌస్‌మేట్స్‌!

బిగ్‌బాస్‌.. శ్రీముఖికి యాంకర్‌ రవి షాక్‌!

బిగ్‌బాస్‌కు వార్నింగ్‌ ఇచ్చిన పునర్నవి

అలీ రెజా ఇంట్లో విషాదం.. భావోద్వేగ పోస్ట్‌

అందరూ ఆమెనే టార్గెట్‌ చేశారా?

ఆ ముగ్గురు పునర్నవిని దూరం పెట్టారా?

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అలీ రీఎంట్రీ?

బాబా భాస్కర్‌ ఎవరిని సేవ్‌ చేయనున్నాడు?

అలీ అవుట్‌.. షాక్‌లో హౌస్‌మేట్స్‌

బిగ్‌బాస్‌.. అతను లేకుంటే షో చూడటం వేస్ట్‌!

బిగ్‌బాస్‌.. అడ్డంగా బుక్కైన శ్రీముఖి

బిగ్‌బాస్‌.. హోస్ట్‌గా నాని!

ప్రేమ విషయం బయటపెట్టిన పునర్నవి

బిగ్‌బాస్‌.. రాహుల్‌పై పునర్నవి ఫిర్యాదు

బిగ్‌బాస్‌.. కన్నీరు పెట్టిన శిల్పా

బిగ్‌షాక్‌.. అలీరెజా అవుట్‌!

హౌస్‌మేట్స్‌ను నిలదీసిన నాగ్‌!

బిగ్‌బాస్‌.. పునర్నవికి ప్రపోజ్‌ చేసిన రాహుల్‌

పెళ్లి చేసుకో.. అంటూ పునర్నవికి సలహా!

ఇంటి నుంచి సందేశాలు.. హౌస్‌మేట్స్‌ కన్నీళ్లు

బిగ్‌బాస్‌.. కెప్టెన్‌గా ఎన్నికైన బాబా భాస్కర్‌