బిగ్‌బాస్‌.. అడ్డంగా బుక్కైన శ్రీముఖి

8 Sep, 2019 18:18 IST|Sakshi

బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో అతి బలమైన కంటెస్టెంట్‌గా శ్రీముఖి ఎంతో ఫేమ్‌ సంపాదించుకుంది. బయట శ్రీముఖికి ఉన్న ఫాలోయింగ్‌ ఈ షోలో బాగానే కలిసిసొస్తుంది. ఎలిమినేషన్‌లో ఉన్న ప్రతీసారి సేవ్‌ అవుతూ వస్తోంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ పరంగా అందర్నీ అలరిస్తూ ఉండే శ్రీముఖి.. టాస్క్‌లు వచ్చేసరికి తనలో ఉండే స్ట్రాటజీలన్నీ బయటకువస్తాయి. టాస్క్‌లో గెలవడమే లక్ష్యంగా ఎలాంటి వ్యూహాలైనా పన్నుతుంది. ఎలిమినేషన్‌లో ఉండే వారి జాతకాన్ని చెబుతూ ఉంటుంది. ఎవరు ఉంటారు? ఎవరు ఎలిమినేట్‌ అవుతారు? అనే విషయాలను అంచనా వేస్తూ ఉంటుంది. అవి నిజాలు కూడా అయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇదంతా బాగానే ఉన్నా.. అందరితో కలిసిపోయే విషయంలో శ్రీముఖి కాస్త వెనకబడింది. అక్కడిదిక్కడ ఇక్కడిదక్కడ చెబుతూ డబుల్‌ గేమ్‌ ఆడుతూ ఉంటుంది. అందరితో మంచి అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది.

శ్రీముఖి.. తనకు అనకూలంగా ఉండేట్టుగా మాటలను మార్చి చెబుతూ ఉంటుంది. దొంగలుదోచిన నగరం టాస్క్‌లో అగ్రెసివ్‌ అయిన వారి పేర్లను చెప్పే క్రమంలో అలీకి 4, రవికి4 రాహుల్‌కు 8 ఓట్లు వచ్చాయి. ఈ విషయాన్నిశ్రీముఖికి వరుణ్‌ వివరిస్తూ.. తన అభిప్రాయాన్ని చెప్పమన్నాడు. అందరు ఊహించినట్టే రాహుల్‌ పేరును ముందుగానే చెప్పేసింది. ఇక మిగిలిన ఒక పేరుకు రవిని సూచించింది. తన చెయ్యిని పట్టుకున్నాడని అందుకే రవి పేరును చెబుతున్నట్లు తెలిపింది. దీంతో రాహుల్‌, రవిలు జైల్లో పెట్టమని బిగ్‌బాస్‌ ఆదేశించారు. 

నిజానికి అక్కడ అలీ పేరు చెప్పాల్సిందని.. అయితే అలీరెజా తన ఫ్రెండ్‌, టాస్క్‌లో తన టీమ్‌ మెంబర్‌ కావడంతో అతని పేరును చెప్పలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రవి అసలు అగ్రెసివ్‌ కాలేదని అయినా.. తన పేరు ఎందుకు చెప్పారని శివజ్యోతి, రాహుల్‌ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఇదే విషయమై.. శ్రీముఖిని నాగ్‌ ప్రశ్నించాడు. దానికి సమాధానంగా.. అక్కడ టై అయిందని తెలీదని.. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయని ఆలోచించలేదని చెబుతూ దాటవేయసాగింది. ఆ విషయాన్ని నాగ్‌ కూడా ఎక్కువగా సాగదీయలేదు. అయితే వీడియో ప్లే చేయించి చూపించొచ్చు కదా అని పలువులు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 

శ్రీముఖి ఎలా అబద్దం ఆడిందో చూడడంటూ.. సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో మీద పెద్ద చర్చనే జరుగుతోంది. శ్రీముఖి అబద్దం చెప్పడం ఇదేం మొదటిసారి కాదంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోకు శ్రీముఖి సపోర్టర్స్‌ ఏం సమాధానం చెబుతారంటూ ఇంకొందరు కామెంట్‌ చేస్తున్నారు. ఈ సీజన్‌లో రోజురోజుకు శ్రీముఖిపై పాజిటివిటీ ఎంత పెరుగుతూ ఉందో .. నెగెటివిటీ కూడా అంతే పెరుగుతోంది. మూడో సీజన్‌ టైటిల్‌ విన్నర్‌ శ్రీముఖే అని మెజార్టీ పార్ట్‌ అభిప్రాయపడుతుండగా.. మరి కడవరకు నిలిచి పోరాడుతుందో లేదో చూడాలి.

 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌.. హోస్ట్‌గా నాని!

ప్రేమ విషయం బయటపెట్టిన పునర్నవి

బిగ్‌బాస్‌.. రాహుల్‌పై పునర్నవి ఫిర్యాదు

బిగ్‌బాస్‌.. కన్నీరు పెట్టిన శిల్పా

బిగ్‌షాక్‌.. అలీరెజా అవుట్‌!

హౌస్‌మేట్స్‌ను నిలదీసిన నాగ్‌!

బిగ్‌బాస్‌.. పునర్నవికి ప్రపోజ్‌ చేసిన రాహుల్‌

పెళ్లి చేసుకో.. అంటూ పునర్నవికి సలహా!

ఇంటి నుంచి సందేశాలు.. హౌస్‌మేట్స్‌ కన్నీళ్లు

బిగ్‌బాస్‌.. కెప్టెన్‌గా ఎన్నికైన బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌.. ఇక ఆమె మారదా అంటూ ఫైర్‌

చిప్పకూడు రుచి చూపించిన బిగ్‌బాస్‌

బిగ్‌బాస్‌.. దొంగలు సృష్టించిన బీభత్సం

బిగ్‌బాస్‌.. అందుకే వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీనా?

పునర్నవి-శ్రీముఖిల మాటల యుద్దం

బిగ్‌బాస్‌.. నామినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

యాంకర్‌.. హోస్ట్‌గా అదరగొట్టే శిల్పా చక్రవర్తి

ఆమె ఎవరన్నది కనుక్కోలేక పోతున్నారా!

హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్‌ ఇచ్చిన క్యాప్షన్స్‌ ఏంటంటే..?

బిగ్‌బాస్‌.. వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఎవరంటే?

శ్రీముఖి.. చంద్రముఖిలా మారింది!

బిగ్‌బాస్‌.. రెచ్చిపోయిన హౌస్‌మేట్స్‌