వరుణ్‌, శివజ్యోతిల ఫైట్‌ మళ్లీ మొదలైంది..

24 Oct, 2019 16:28 IST|Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3 లో నామినేషన్‌లోకి వచ్చిన ఇంటిసభ్యులతో బిగ్‌బాస్‌ ఫీట్లు చేయిస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్‌లో వారితో సర్కస్‌ ఫీట్లు చేయించగా.. నేడు హౌస్‌మేట్స్‌ మధ్య చిచ్చు పెట్టనున్నాడు. ఈ క్రమంలో ఇంటిసభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగేట్టు తెలుస్తోంది. టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులు.. నచ్చని హౌస్‌మేట్‌పై రంగు పోసి అందుకు గల కారణాలు చెప్పాల్సి ఉంటుంది. బిగ్‌బాస్‌ ఇచ్చిన ఈ టాస్క్‌తో ఇంట్లో పాత గొడవలు భగ్గుమన్నట్లు తెలుస్తోంది.

వారం ప్రారంభంలో జరిగిన నామినేషన్‌ టాస్క్‌లోని జరిగిన లొల్లిని శివజ్యోతి ప్రస్తావించడంతో వరుణ్‌ ఒంటికాలిపై లేచాడు. తన సహనాన్ని కోల్పోయి శివజ్యోతిపై విరుచుకుపడ్డాడు. ‘మానిప్యులేటివ్‌గా మాట్లాడకు..’ అంటూ శివజ్యోతిపై మండిపడ్డాడు. గొడవను సర్ది చెప్పాలని చూసిన రాహుల్‌పైనా తిరుగుదాడి చేశాడు. దీంతో వీరి గొడవ ఎక్కడిదాకా వెళుతుందో చూడాలి. కాగా వరుణ్‌.. బాబాపై, శివజ్యోతి.. వరుణ్‌పై, బాబా.. అలీపై, శ్రీముఖి.. శివజ్యోతిపై రంగు పోసినట్టు తెలుస్తోంది. తాజా ప్రోమో ఆసక్తి రేకెత్తించినప్పటికీ ఎపిసోడ్‌ మాత్రం సాదాసీదాగానే ఉంటుందని ప్రోమో లవర్స్‌ విమర్శిస్తున్నారు.

మరిన్ని వార్తలు