బిగ్‌బాస్‌.. రెండోసారి కెప్టెన్‌గా ఎన్నికైన వరుణ్‌

30 Aug, 2019 22:56 IST|Sakshi

తన అల్లరి చేష్టలతో బాబా భాస్కర్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లో సందడి చేశారు. చలో ఇండియా టాస్క్‌లో బెస్ట్‌ పర్ఫామెన్స్‌గా రాహుల్‌, వరుణ్‌లను ఎంచుకోవడంపై సెటైర్లు వేశాడు. పునర్నవి, రవి, రాహుల్‌ బెస్ట్‌ పర్ఫామెన్స్‌లుగా చెప్పుకొచ్చిన పునర్నవి, రవిలపై ఫన్నీ కామెంట్లు చేశాడు. వారిద్దరు ఏం చేశారని, 70 ముద్దులు పెట్టుకున్నాడంటూ బాబా కామెంట్లు చేస్తుండగా.. రవి వచ్చి 60 ముద్దులే పెట్టానని సరదాగా చెప్పాడు. తాను హౌస్‌లో కెప్టెన్‌ అయితే ఆడవారు పొద్దున్నే లేవాలని, పొట్టి డ్రెస్సులు వేసుకోకూడదని, అలీరెజా కూడా బాత్రూమ్‌కు వెళ్లే ముందు దుప్పటి తీసుకెళ్లాలనే ఆదేశాలు జారీ చేస్తానని బాబా చెప్పుకొచ్చాడు.

ఇక నేటి ఎపిసోడ్‌లో రాహుల్‌-శ్రీముఖిలు కలిసిపోయినట్లుగా అనిపించినా.. మళ్లీ కొద్ది సేపటికే తేడాలు వచ్చినట్టు కనిపిస్తోంది. మొదటిసారి కెప్టెన్‌ టాస్క్‌ వెళ్లబోతోన్నావు.. కెప్టెన్‌గా ఎన్నికైతే బయట నీ ఫ్యాన్స్‌ రచ్చ రచ్చ చేస్తారు.. రక్తాభిషేకాలు చేస్తారు అని సరదాగానే అన్నా.. రాహుల్‌ మాత్రం కాస్త ఫీలైనట్లు కనిపిస్తోంది. చివరకు కెప్టెన్‌ పోటీలో ఓడిపోవడంతో శ్రీముఖి మళ్లీ ఎగతాళిగా మాట్లాడిదంటూ వరుణ్‌తో రాహుల్‌ చెప్పుకొచ్చాడు.

ఉత్కంఠగా సాగిన కెప్టెన్సీ టాస్క్‌
బురదలో ఉన్న మూడు రంగుల బంతులను.. మూడు బుట్టల్లో వేయాలి. ఎవరికి కేటాయించిన బంతులను వారికోసం ఏర్పాటు చేసిన బుట్టల్లో వేయాలి. ఆ ముగ్గురిని ఒకే తాడుతో బంధించగా.. ఇద్దర్నీ వారి బుట్టల్లో బంతులను వేయకుండా నిరోధిస్తూ మిగిలిన వ్యక్తి బంతులను వేయాల్సి ఉంటుంది. ఇలా ఎండ్‌ బజర్‌ మోగే వరకు ఎవరి బుట్టల్లో ఎక్కువ బంతులుంటాయో వారే కెప్టెన్‌గా ఎన్నికవుతారని తెలిపాడు. దీంతో రాహుల్‌, బాబా భాస్కర్‌, వరుణ్‌ సందేశ్‌లు ఒకర్నొకరు తోసుకుంటూ బంతులు వేసేందుకు ప్రయత్నించారు. చివరకు వరుణ్‌ సందేశ్‌ 27, బాబా భాస్కర్‌ 13, రాహుల్‌ 15 బంతులు వేశాడు. దీంతో వరుణ్‌ సందేశ్‌ రెండో సారి కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. 

సరదాగా సాగిన రంగుపడుద్ది టాస్క్‌
ఈ సారి లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌ ఫన్నీగా సెట్‌ చేశాడు బిగ్‌బాస్‌. గార్డెన్‌ ఏరియాలో ఏర్పాటు చేసిన వీల్‌(చక్రం)కు కెప్టెన్‌ అయిన వరుణ్‌ సందేశ్‌ను కట్టి.. అతని చుట్టు ఇంటికి కావాల్సిన సరుకుల లిస్ట్‌ పెట్టాడు. ఇక హౌస్‌ మేట్స్‌ అందరూ తమకిచ్చిన రంగుల బంతులతో గురి చూసి కొట్టాలి. గురిచూసిన కొట్టిన సరుకులను లగ్జరీ బడ్జెట్‌లో లభిస్తాయని, అలాగే చలో ఇండియా టాస్క్‌లో భాగంగా గెలిచిన ఇంటి సభ్యులైన రవి, మహేష్‌, బాబా భాస్కర్‌, అలీరెజాకు రెండేసి సరుకులను ఎంచుకునే అవకాశం ఇచ్చాడు. గురి చూసి కొట్టేందుకు ఇంటి సభ్యులంతా చాలా కష్టపడ్డారు. అక్కడ వరుణ్‌ సందేశ్‌ పరిస్థితి కూడా కుడిదిలో పడ్డ ఎలుకలా అయింది. ఏ బంతి వచ్చి తనకు ఎక్కడ తగులుతుందా? అని భయపడుతూ ఉన్నాడు.

ఆరో వారం కూడా గడిచేందుకు వచ్చేసింది. అయితే ఈ వీకెండ్‌పై ప్రస్తుతం ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి. ఇప్పటికే పలు రకాలు రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ వీకెండ్‌లో నాగ్‌ రాకపోవచ్చని.. ఎలిమినేషన్‌ కూడా ఉండకపోవచ్చని రూమర్స్‌ వైరల్‌ అవుతున్నాయి. నాగ్‌ తన పుట్టిన రోజును సెలెబ్రేట్‌ చేసుకునేందుకు విదేశాలకు వెళ్లిన నేపథ్యంలో వీకెండ్‌ షోకు హాజరు కాలేకపోతున్నాడని.. ఇలా పలురకాల వార్తలు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే ఇవన్నీ నిజమో లేదో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌ తన ఆదేశాల్ని మరిచిపోయారా?

బిగ్‌బాస్‌.. రాహుల్‌కు అసలు పరీక్ష

బిగ్‌బాస్‌.. ఆ ముగ్గురిలో కెప్టెన్‌ కాబోయేదెవరు?

బిగ్‌బాస్‌.. డైరెక్షన్‌ చేస్తోన్న బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌.. రాహుల్‌ను ఓదారుస్తున్న నెటిజన్లు

హౌస్‌మేట్స్‌కు చుక్కలు చూపించిన బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌ 3: తెరపైకి కొత్త వివాదం!

బిగ్‌బాస్‌: రాహుల్‌ ఫ్లాష్‌బ్యాక్‌.. ప్చ్‌ పాపం!

బిగ్‌బాస్‌: పునర్నవి లవ్‌ ట్రాక్‌ రాహుల్‌తో కాదా?

బిగ్‌బాస్‌.. ఆ ముగ్గురికి షాక్‌

భార్యాభర్తల మధ్య గొడవ సీక్రెట్‌ టాస్క్‌లో భాగమా?

బిగ్‌బాస్‌.. మహేష్‌ స్ట్రాటజీపై కామెంట్స్‌

బిగ్‌బాస్‌.. ఏయ్‌ సరిగా మాట్లాడురా అంటూ అలీ ఫైర్‌

బిగ్‌బాస్‌.. నామినేషన్స్‌లో ఉన్నది ఎవరంటే?

బిగ్‌బాస్‌.. ఆ నలుగురు విడిపోనున్నారా?

బిగ్‌బాస్‌.. రాహుల్‌ ప్రతీకారం తీర్చుకోనున్నాడా?

బిగ్‌బాస్‌ నిర్వాహకులతో మాకు ఆ సమస్య లేదు! 

వారికి హౌస్‌లో ఉండే అర్హత లేదు : అషూ

నాగార్జున పేరును మార్చిన బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌.. అషూ ఎలిమినేటెడ్‌!

బిగ్‌బాస్‌.. వరుణ్‌కు వితికా శత్రువా?