బిగ్‌బాస్‌: పెళ్లిపై స్పందించిన విజయ్‌ దేవరకొండ

27 Oct, 2019 13:22 IST|Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో మిగిలిన ఆరుగురిలోంచి ఒకరు ఎలిమినేట్‌ కానున్నారు. ఇప్పటికే రాహుల్‌ సిప్లిగంజ్‌, బాబా భాస్కర్‌, శ్రీముఖిలు టికెట్‌ టు ఫినాలే దక్కించుకుని టాప్‌ 5లో నిలిచారు. మిగతా ముగ్గురిలో ఫైనల్‌కు చేరే ఆ ఇద్దరు ఎవరనేది ఆసక్తి రేపుతోంది. ఇక వీకెండ్‌లో దీపావళి రావటంతో బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఓ అతిథిని తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. తాజా ప్రోమోను చూసినట్టయితే.. విజయ్‌ దేవరకొండ బిగ్‌బాస్‌ హౌస్‌లోని కన్ఫెషన్‌ రూమ్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో ఇంటి సభ్యులను ఒక్కొక్కరిగా కన్ఫెషన్‌ రూంలోకి పంపించగా రౌడీ స్టార్‌ను చూసి సర్‌ప్రైజ్‌ అయ్యారు. జ్యోతక్క ఓ అడుగు ముందుకేసి లడ్డుగైనవ్‌.. అంటూ అతన్ని ఆటపట్టించింది.

వైఫ్‌ లేకుండా ఎలా ఉంటున్నావ్‌ అని విజయ్‌.. వరుణ్‌ను ఆటపట్టించాడు. అంతేకాకుండా అతడి క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్నాడు ఈ టాలీవుడ్‌ రౌడీ. ఈ సమయంలో నాగ్‌.. విజయ్‌ను ఆసక్తికర ప్రశ్న అడిగాడు. ‘నీ పెళ్లి గురించి ఎప్పుడూ రూమర్స్‌ వస్తూనే ఉంటాయి. మరి నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావ్‌’ అని అడిగాడు. దీనికి రౌడీ స్పందిస్తూ ‘ఇంకా తన అమల దొరకలేదు’ అని నాగ్‌కు ఫన్నీ కౌంటర్‌ ఇచ్చాడు. దీనికి నాగ్‌ బదులిస్తూ ‘నీకు నీ అమల త్వరగా దొరకాలని కోరుకుంటున్నా’నని తెలిపాడు. దీంతో నేటి ఎపిసోడ్‌ సరదాగా సాగుతున్నట్టు కనిపిస్తోంది. రౌడీ సందడిని చూడాలంటే నేటి ఎపిసోడ్‌ వచ్చేంతవరకు వేచి ఉండాల్సిందే!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌ ఇంట్లో సుమ రచ్చ రంబోలా..

బిగ్‌బాస్‌: దోస్తులతో శివజ్యోతి సంబరాలు!

బిగ్‌బాస్‌: బ్యాగు సర్దుకున్న మరో కంటెస్టెంట్‌

బిగ్‌బాస్‌: ‘శ్రీముఖి వల్ల అందరూ బలవుతున్నారు’

షాకింగ్‌, రాహుల్‌ బండబూతుల వీడియో

బిగ్‌బాస్‌ : మరొకరికి టికెట్‌ టు ఫినాలే

‘అందుకే శ్రీముఖికి సపోర్ట్‌ చేయడం లేదు’

బిగ్‌బాస్‌ 3 గ్రాండ్ ఫినాలే!?

బిగ్‌బాస్‌: అర్థరాత్రి ‘బిగ్‌’ షాక్‌

బిగ్‌బాస్‌: లీకువీరుల కన్నా ముందే పసిగట్టారు!

జీవితంలో పెద్ద తప్పు చేశానన్న శివజ్యోతి..

శ్రీముఖి జీవితాన్ని కుదిపేసిన బ్రేకప్‌

బిగ్‌బాస్‌ నిర్వాహకుల అనూహ్య నిర్ణయం

వరుణ్‌, శివజ్యోతిల ఫైట్‌ మళ్లీ మొదలైంది..

శ్రీముఖి కోసం ప్రచారం చేస్తున్న టాప్‌ యాంకర్‌

చిచ్చా గెలుపు.. ప్రతీకారం తీర్చుకుంటున్న ఫ్యాన్స్‌

బిగ్‌బాస్‌ ఇంట్లో సర్కస్‌, నేడే చూడండి!

బిగ్‌బాస్‌: ఫైనల్‌కు రాహుల్‌, అలీకి బిగ్‌ షాక్‌

బిగ్‌బాస్‌: అలీని చూసి వణికిపోతున్న హౌస్‌మేట్స్‌

బిగ్‌బాస్‌: బాబాపై ప్రతాపాన్ని చూపిస్తున్న అలీ..

ఏదైనా రాజకీయాలు జరిగితే శ్రీముఖి విన్నర్‌ కావొచ్చు..

రాహుల్‌ది ఫేక్‌ రిలేషన్‌షిప్‌ : వితికా

బిగ్‌బాస్‌: ఫైనల్‌కు వెళ్లే ఆ ఒక్కరు ఎవరు?

బిగ్‌బాస్‌: వితికను పట్టుకుని ఏడ్చేసిన వరుణ్‌

బిగ్‌బాస్‌పై శివ బాలాజీ షాకింగ్‌ కామెంట్స్‌!

బిగ్‌బాస్‌: ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌..!