బిగ్‌బాస్‌: వితికా ఎలిమినేట్‌.. ఇది ఫిక్స్‌!

20 Oct, 2019 09:35 IST|Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ -3  తుది ఘట్టానికి చేరుకుంది. ఇప్పటికే 90 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకున్న ఈ షో ఫైనల్‌ పోరు వైపు దుసుకెళ్తుంది. అయితే ఇప్పటివరకు జరిగిన నామినేషన్‌ ప్రక్రియకు భిన్నంగా ఈ వారం జరిగింది. పదమూడో వారానికి గాను జరిగిన నామినేషన్‌ ప్రక్రియలో ఇంట్లో ఉన్న ఏడుగురు ఇంటి సభ్యులు నామినేట్‌ అయ్యారు. హౌస్‌లో ఉన్న ఏడుగురు నామినేట్‌ అవడంతో ఎవరు ఎలిమినేట్‌ అవుతారనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటివరకు బిగ్‌బాస్‌ హౌస్‌లో ఏం జరగబోతోందో ముందే చెబుతున్న లీకువీరులు తాజాగా ఈ వారం ఎలిమినేట్‌ ఎవరవుతున్నారో ముందే చేప్పేశారు. 

పదమూడో వారానికి గాను వితికా షేరు ఎలిమినేట్‌ అయినట్లు లీకువీరులు ఫిక్స్‌ చేశారు. అంతేకాకుండా సోషల్‌ మీడియాలో కూడా వితికా బిగ్‌బాస్‌ హౌస్‌ను వీడినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో భార్యభర్తలుగా హౌజ్‌లోకి అడుగుపెట్టిన వితికా-వరుణ్‌లు విడిపోనున్నట్లు తెలుస్తోంది. ఇక వితికా లేని వరుణ్‌ గేమ్‌ ఇంకా బాగా ఆడతాడా లేక చతికిలపడతడా అనేదానిపై తెగ చర్చ జరుగుతోంది. ఆమె ఎలిమినేట్‌ కావడానికి గల అనేక కారణాలను కూడా నెటిజన్లు పేర్కొంటున్నారు. 

మెడాలియన్‌ టాస్క్‌ గెలవడానికి బాబా భాస్కర్‌తో ప్రవర్తించిన తీరు.. ఈ వారం జరిగిన నామినేషన్‌ ప్రక్రియలో శివజ్యోతితో వరుణ్‌-వితికల వాగ్వాదం ఆమె ఎలిమినేషన్‌కు కారణాలుగా పేర్కొంటున్నారు. పునర్నవి భూపాలం ఎలిమినేషన్‌ తర్వాత రాహుల్‌ కూడా వరుణ్‌-వితికాలతో అంత సఖ్యంగా ఉండటం లేదు. దీంతో వితికాకు ఓటింగ్‌ శాతం తగ్గింది. అంతేకాకుండా ఉన్న ఏడుగురు ఇంటిసభ్యుల్లో వీక్‌ కంటెస్టెంట్‌ వితికా కావడంతోనే ఆమెకు ఓట్లు తక్కువ వచ్చాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక వరుణ్‌, రాహుల్‌, పునర్నవిల సహాయంతోనే ఇన్ని రోజులు నామినేషన్‌ కాకుండా సేఫ్‌ అయిందని లేకుంటే వితికా ఎప్పుడో హౌస్‌ను వీడేదని మరికొంతమంది​ కామెంట్‌ చేస్తున్నారు. ఇక వితికా ఎలిమినేషన్‌ విషయం అధికారికంగా తెలియాలంటే నేడు ప్రసారమయ్యే ఎపిసోడ్‌ వరుకు వేచిచూడాల్సిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు