బిగ్‌బాస్‌: ఇంటి సభ్యులందరికీ బిగ్‌ షాక్‌!

20 Sep, 2019 09:20 IST|Sakshi

బిగ్‌బాస్‌ ఇచ్చిన క్రేజీ కాలేజీ టాస్క్‌లో బెస్ట్‌ టీచర్‌గా బాబా భాస్కర్‌, బెస్ట్‌ స్టూడెంట్‌గా మహేశ్‌ ఎంపికయ్యారు. ‘ప్రచారమే ఆయుధం’ అనే కెప్టెన్సీ టాస్క్‌లో బాబా భాస్కర్‌ అతని బంటుగా పేరొందిన మహేశ్‌ తలపడ్డారు. వీరిద్దరూ ఇంటి సభ్యుల దగ్గరికి వెళ్లి గెలిపించమని మద్దతు కోరగా.. ఎవరి ప్రచారమైతే నచ్చుతుందో వారి మెడలో ఇంటి సభ్యులు పూలదండను వేస్తారు. ‘అధికారంలో ఉన్నప్పుడే మనిషి గుణం తెలుస్తుంది ఇది నేను చెప్పింది కాదు.. మహాత్మాగాంధీ చెప్పిన మాట. నాలో మార్పు కోసం నేను కెప్టెన్సీ కోరుకుంటున్నా’నంటూ మహేశ్‌ తన మాటలతో మ్యాజిక్‌ చేశాడు. అదేవిధంగా మహేశ్‌కు ఒక చాన్సిచ్చి చూద్దాం అని భావించిన ఇంటి సభ్యులందరూ (వితిక, పునర్నవి తప్ప) మహేశ్‌కు పూలమాలలు వేసి కెప్టెన్‌గా గెలిపించారు. ఇక కెప్టెన్‌ మహేశ్‌.. సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కెప్టెన్‌ మీటింగ్‌ పెట్టే ఆలోచనలో ఉన్నాడు.

చెప్పుకోండి చూద్దాం అనే లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌లో హిమజ సంచాలకులుగా వ్యవహరించింది. ఈ టాస్క్‌లో కెప్టెన్‌ మహేశ్‌ ప్లకార్డును పట్టుకుంటాడు కానీ దాన్ని చూడడు. ఇంటిసభ్యులు నేరుగా అక్కడ రాసి ఉన్న పేరును కెప్టెన్‌తో చెప్పించాలి. అందరూ సరిగ్గా చెప్పడంతో లగ్జరీబడ్జెట్‌ టాస్క్‌ విజయవంతంగా పూర్తయింది. ఇక ఎప్పుడూ డాన్స్‌తో హుషారుగా ప్రారంభమయ్యే రోజు కాస్త నేటి ఎపిసోడ్‌లో డల్‌గా స్టార్ట్‌ అయింది. లేస్తూనే ఏడుపు లంకించుకున్న శివజ్యోతిని శ్రీముఖి ఎత్తుకుని బుజ్జగించింది. అటు వితిక కూడా వరుణ్‌ ఒడిలో తలపెట్టి కన్నీళ్లు కార్చింది. దీంతో ఇంట్లో వాతావరణం ఎమోషనల్‌గా మారగా.. ఇది తర్వాత ఎపిసోడ్‌లోనూ కొనసాగనుంది. కాగా ఇంటిసభ్యులందరికీ బిగ్‌బాస్‌ బిగ్‌షాక్‌ ఇచ్చాడు. (చదవండి: ఈ మాత్రం దానికి బిగ్‌బాస్‌ షో అవసరమా!)

బిగ్‌బాస్‌ ఇంట్లో అడుగుపెట్టి 60 రోజులు పూర్తయినందున ఫ్యామిలీని మిస్‌ అవుతున్న ఇంటి సభ్యుల కోసం ఓ సర్‌ప్రైజ్‌ సిద్ధం చేశాడు. అయితే ఓ మెలిక కూడా పెట్టాడు. ఇంటి సభ్యులు ఎవరూ మాట్లాడటానికి వీలులేదని తెగేసి చెప్పాడు. అనంతరం వారి కుటుంబ సభ్యులను, స్నేహితులను చూపించగా ఇంటి సభ్యులందరూ ఉద్వేగానికి లోనయ్యారు. శ్రీముఖి, శివజ్యోతిలు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఇక పార్టిసిపెంట్స్‌ను కలవడానికి వచ్చిన కుటుంబ సభ్యులతో బిగ్‌బాస్‌ గేమ్‌ ఆడించనున్నాడు. అందులో భాగంగా అయిదింటిలో జోకర్‌, అయిదింటిలో ఐ లోగో ఉన్న బాక్సులను ఏర్పాటు చేశాడు. ఐ లోగో వచ్చిన వారితో గేమ్‌ ఆడించి అందులో గెలిచిన ఇద్దరికి మాత్రమే ఇంట్లోకి వెళ‍్లే అవకాశముందని చెప్పాడు. ఇప్పటికే వితిక లక్కీ చాన్స్‌ కొట్టేసింది. కాగా వితిక, రవిలకు ఇంటిసభ్యులను కలుసుకునే గోల్డెన్‌ చాన్స్‌ దక్కిందని సమాచారం!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు