బిగ్‌బాస్ 4: ఈసారి పాల్గొనేది వీళ్లేనా?

22 May, 2020 16:20 IST|Sakshi

లాక్‌డౌన్ వ‌ల్ల అన్ని షూటింగ్‌ల‌కు ప్యాక‌ప్ చెప్పిన విష‌యం తెలిసిందే. సినిమాలు, సీరియళ‌్లు ఎక్క‌డిక‌క్క‌డ ఆగిపోయాయి. ఇక రియాలిటీ ప్రోగ్రామ్స్ ఓ లెక్కా? తాజాగా కేంద్రం ఇచ్చిన లాక్‌డౌన్ స‌డ‌లింపుల్లోనూ షూటింగ్‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ప‌డలేదు. దీంతో ప్రేక్ష‌కులు ఎంత‌గానో అభిమానించే బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో ఈసారి ఉంటుందా? లేదా అని అభిమానులు తెగ కంగారుప‌డ్డారు. కానీ ఆరు నూరైనా బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్ తెర‌కెక్కిస్తాం అంటోంద‌ట స్టార్ మా యాజ‌మాన్యం. ఇప్ప‌టికే అందుక‌వ‌స‌ర‌మ‌య్యే ప‌నుల‌ను ప్రారంభించిన‌ట్లు తెలుస్తోంది. 

నాల్గో సీజ‌న్‌కు వ్యాఖ్యాత‌గా ఎవ‌రు?
తెలుగు నాట బిగ్‌బాస్ షోకు ఉన్న ఆద‌ర‌ణ మ‌రింకే ప్రోగ్రామ్‌కు లేద‌ని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి లేదు. బిగ్‌బాస్ ప్రారంభ‌మ‌య్యే స‌మ‌యానికి టంచ‌నుగా ప్రేక్ష‌కులు టీవీల‌కు అతుక్కుపోతారు. అలా ఎంద‌రో ఆద‌రాభిమానాల‌ను చూర‌గొన్న బిగ్‌బాస్ ఇప్ప‌టికే మూడు సీజ‌న్ల‌ను విజ‌యవంతంగా పూర్తి చేసుకుంది. హీరోలు నాని, ఎన్టీఆర్, నాగార్జున వ‌రుస‌గా మూడు సీజ‌న్ల‌కు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించారు. నాల్గ‌వ సీజ‌న్‌కు తొలుత మ‌హేశ్‌బాబు హోస్ట్ చేయ‌నున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చినప్ప‌టికీ అది అంత సుల‌భం కాద‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో మ‌రోసారి నాగార్జునే క‌నిపించ‌నున్నాడా? లేక ఎలాగోలా ప్రిన్స్ మ‌హేశ్‌బాబే హోస్ట్‌గా తెర‌పై సంద‌డి చేయ‌నున్నాడా అనేది వేచి చూడాల్సిందే. (‘రాహుల్‌ లిప్‌లాక్‌ సీన్‌ వైరల్‌.. నేను సచ్చిపోతా’ )

బిగ్‌బాస్ హౌస్‌లోకి ఆ న‌లుగురు
బిగ్‌బాస్ కార్యక్ర‌మం సాధార‌ణంగా జూలైలో ప్రారంభం కావాల్సి ఉంటుంది. అయితే ఈసారి కాస్త లేట‌య్యేట్టున్నా లేటెస్ట్‌గా వ‌చ్చేందుకు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.  ఇప్ప‌టికే బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేవారిని ఎంపిక చేసే ప‌నిలో ప‌డ్డారు. అందులో కొంత‌మంది పేర్ల‌ను లీకువీరులు బ‌య‌ట‌పెట్టేశారు. తెలంగాణ యాస‌తో మాట‌ల, పాట‌ల గార‌డీ చేసే మంగ్లీ, హీరో త‌రుణ్‌, యాంక‌ర్ వ‌ర్షిణి సౌంద‌ర‌రాజ‌న్‌, సీరియ‌ల్ న‌టుడు అఖిల్ సార్థ‌క్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఈ న‌లుగురి పేర్లు ఫైన‌ల్ లిస్టులో ఉంటాయా? లేదా?  వీళ్ల‌తోపాటు ఇంకా ఎవ‌రెవ‌రు బిగ్‌బాస్ ఇంట్లోకి వెళ్తారు? అనేది తెలియాలంటే అధికారికంగా వెల్ల‌డించే వ‌ర‌కు వెయిట్ చేయ‌డం త‌ప్ప ఇంకో మార్గం లేదు. (బిగ్‌బాస్‌ ట్రోఫీ, మనీ వద్దు: శ్రీముఖి)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు