డాక్టర్‌ ఎస్‌ అనిత ఎంబీబీఎస్‌

9 Mar, 2018 12:18 IST|Sakshi
డాక్టర్‌ అనితా ఎంబీబీస్‌ ఫస్ట్‌ లుక్‌

ఓ సాధారణ యువతి జీవిత కథాంశంతో బయోపిక్‌

యువతి పాత్రలో తమిళ బిగ్‌బాస్‌ ఫేమ్‌ జూలీ

బయోపిక్‌ ట్రెండ్స్‌ నడుస్తున్న ఈ తరుణంలో కోలీవుడ్‌లో మరో బయోపిక్‌కు రంగం సిద్దమైంది. అయితే ఈ బయోపిక్‌ ఏ క్రీడాకారుడో లేక సెలబ్రిటీ జీవిత కథాంశంగానో తెరకెక్కడం లేదు.  డాక్టర్‌ కావాలని కన్న కలలను నీట్‌ పరీక్ష నీరుగార్చడంతో ఆత్మహత్య చేసుకున్న ఓ సాధారణ యువతి జీవితం ఆధారంగా రూపొందుతోంది. ఇంటర్మీడియట్‌లో మంచి మార్కులు తెచ్చుకున్న ఎస్‌ అనిత అనే ఓ తమిళ యువతి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నీట్‌ పరీక్షలో అర్హత సాధించలేకపోయింది.

దీంతో నీట్‌ పరీక్ష రద్దు చేయాలని ఆ యువతి ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నీట్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ తమిళనాడులోనే కాక పలు రాష్ట్రాల్లోను ఆందోళనలు జరిగాయి. అనిత జీవితం ఆధారంగానే తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఆమె పాత్రలో తమిళ బిగ్‌బాస్‌ ఫేమ్‌ జూలీ నటిస్తున్నారు. ఆర్‌జే పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీకి ‘డాక్టర్‌ ఎస్‌. అనిత ఎంబీబీఎస్‌’  టైటిల్‌ను ఖరారు చేశారు. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ విడుదల కాగా సోషల్‌ మీడియాలో మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా