బిగ్‌బాస్‌ 4 సీజన్‌లో సమంత?

27 Jun, 2020 15:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మా టీవీలో ప్రసారమయిన బిగ్‌బాస్‌ షో పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు మూడు  సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో నాలుగో సీజన్‌ కోసం రెడీ అవుతోంది. అయితే నాలుగో సీజన్‌కు హోస్ట్‌ను వెతికే పనిలో ఎప్పటి నుంచో నిమగ్నమైంది బిగ్‌బాస్‌ టీం. మొదటి సీజన్‌కు జూనియర్‌ ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించగా, రెండో సీజన్‌ను నాని, మూడో సీజన్‌ను నాగార్జున హోస్ట్‌ చేశారు. అయితే మొదటి సీజన్‌కు వచ్చినంత టీఆర్‌పీ రేటింగ్‌ రెండు, మూడు సీజన్లకు రాలేదు. (బిగ్‌బాస్ 4: ఈసారి పాల్గొనేది వీళ్లేనా?)

దీంతో షోను ఆసక్తిగా మార్చడానికి  ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే వ్యాఖ్యత కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎప్పుడూ యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉండే అక్కినేని నాగార్జున కోడలు సమంతను బిగ్‌బాస్‌ టీం సంప్రదించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి సమంత తుది నిర్ణయం తీసుకోనట్లు తెలుస్తోంది. సమంత కనుక ఈ ఆఫర్‌ను అంగీకరిస్తే బిగ్‌బాస్‌ను హోస్ట్‌ చేస్తున్న మొదటి మహిళగా రికార్డు సృష్టిస్తుంది. దీనికి సంబంధి క్లారిటీ రావడానికి బిగ్‌బాస్‌ టీం అఫీషియల్‌గా ప్రకటించే వరకు  వేచి చూడాల్సిందే. (మరోసారి బుల్లితెరపై ఎన్టీఆర్‌ సందడి)

మరిన్ని వార్తలు