శివబాలాజీ ఇంటికి బిగ్‌బాస్‌!

14 Oct, 2017 08:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు బుల్లితెరపై సరికొత్త రియాల్టీ షో బిగ్‌బాస్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. జూనియర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యహరించిన ఈషో 70 రోజుల పాటు ప్రేక్షకులను అలరించింది. మొత్తం 14 మందితో మొదలైన తొలిసీజన్‌ విజేతగా హీరో శివబాలాజీ నిలిచాడు. భారీ మొత్తంలో ప్రైజ్‌ మనీ గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజగా శివబాలాజీ ఇంటికి బిగ్‌బాస్‌ వచ్చాడు. అంతే కాకుండా టాస్క్‌ కూడా ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేశాడు.

వివరాల్లోకి వెళ్తే శివబాలాజీ, రాజీవ్‌ కనకాల ప్రధాన పాత్రల్లో స్నేహమేరా జీవితం అనే చిత్రం తెరకెక్కింది. ఈచిత్రం ప్రమోషన్లలో భాగంగా బిగ్‌బాస్‌ వాయిస్‌ను ఉపయోగించుకున్నారు. ఇందులో భాగంగా ఒక ప్రమోషన్‌ వీడియోని విడుదల చేశారు. అందులో శివబాలాజీ ఇంట్లో కూర్చుని ఉండగా బిగ్‌బాస్‌ వాయిస్‌ వినిపిస్తుంది. షో విజేతగా నిలిచినందుకు, స్నేహమేరా జీవితం సినిమా ట్రైలర్‌ 1మిలియన్‌ వ్యూస్‌ దాటినందుకు బిగ్‌బాస్‌ శుభాకాంక్షలు తెలిపారు.

అంతేకుండా ప్రీజ్‌, రిలీజ్‌ టాస్క్‌ను కూడా చేయించారు. ప్రేక్షకులకు కూడా ప్రత్యేక టాస్క్‌ ఇచ్చారు. సినిమా సారాంశాన్ని ఒక్క నిమిషం నిడివి ఉన్న వీడియో తీసి పంపాలి. ఆ వీడియో సినిమా  కథకు దగ్గరగా ఉంటే వారికి శివబాలాజీ, రాజీవ్‌ కనకాలను కలిసే అవకాశం కల్పిస్తు‍న్నట్లు ప్రకటించాడు. బిగ్‌బాస్‌ తన ఇంటికి వచ్చినట్లుగా తీసిన ఈ వీడియోను శివబాలాజీ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ఇంక ఎందుకు ఆలస్యం మీరూ ఒక వీడియో తీసి ఓసారి ప్రయత్నించండి.

మరిన్ని వార్తలు