విజయ్‌ వర్సెస్‌ విజయ్‌

27 Aug, 2019 10:38 IST|Sakshi

దీపావళి ఇళయ దళపతి విజయ్‌కు లక్కీగా మారింది. ఆయన నటించిన మెర్శల్, సర్కార్‌ చిత్రాలు దీపావళికి విడుదలై ఘన విజయాన్ని సాధించాయి.  తాజాగా ఆయన నటించిన బిగిల్‌ చిత్రాన్ని దీపావళికి తెరపైకి తాసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. విజయ్‌కు జంటగా నయనతార నటిస్తున్న ఈ చిత్రాన్ని అట్లీ తెరకెక్కిస్తున్నాడు. ఏజీఎస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌ గ్యాంగ్‌స్టర్, ఫుట్‌బాల్‌ క్రీడా శిక్షకుడిగా ద్విపాత్రా భినయం చేస్తున్నారు.

అసలు విషయం ఏమిటంటే ఈ దీపావళికి విజయ్‌ చిత్రంతో విజయ్‌సేతుపతి నటించిన సినిమా పోటీపడనుంది. బహుభాషా నటుడిగా పేరు తెచ్చుకున్న విజయ్‌ సేతుపతి తాజాగా నటిస్తున్న చిత్రం సంఘతమిళన్‌. విజయాప్రొడక్షన్స్‌ పతాకంపై బి.భారతీరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్‌సేతుపతికి జంటగా రాశీఖన్నా, నివేదాపేతురాజ్‌ నటిస్తున్నారు. స్కెచ్‌ చిత్రం ఫేమ్‌ విజయ్‌చందర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్‌సేతుపతి తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం.

కాగా సంఘతమిళన్‌ చిత్రాన్ని దీపావళికి విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. దీంతో విజయ్, విజయ్‌ సేతుపతిలు దీపావళి బరిలో ఢీకొనడం ఖాయం అయింది. వరుస విజయాల జోరులో ఉన్న ఈ ఇద్దరు హీరోల చిత్రాలు ఒకేసారి తెరపైకి రావడం ఇదే మొదటిసారి. విజయ్‌ బిగిల్‌పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అలాంటిది ఆయన చిత్రానికి పోటీగా వస్తున్నాడంటే విజయ్‌సేతుపతి సంఘతమిళన్‌ చిత్రాన్ని తక్కువగా చూడలేం. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ దీపావళికి విజయ్, విజయ్‌సేతుపతి అభిమానుల హడావుడీ చూడబోతున్నామన్నమాట.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సూర్య చిత్రానికి అడ్డంకులు

పీవీఆర్‌ సినిమాస్‌, సినిపొలిస్‌లకు షాక్‌

అమ్మకు ప్రేమతో.. దేవీ శ్రీ ప్రసాద్

మరో సినిమాతో వస్తా!

కౌసల్య కృష్ణమూర్తి చేయడం అదృష్టం

కీర్తీ... మిస్‌ ఇండియా

నవ్వుల్‌ నవ్వుల్‌

మంచి సందేశంతో మార్షల్‌

చీమ మనిషిగా మారితే...!

టెన్నిస్‌ ఆడతా!

తెలుగులో లస్ట్‌ స్టోరీస్‌

వారిద్దరు విడిపోయారా?!

ప్లాన్‌ మారింది

బిగ్‌బాస్‌.. నామినేషన్స్‌లో ఉన్నది ఎవరంటే?

బిగ్‌బాస్‌.. ఆ నలుగురు విడిపోనున్నారా?

ఆ చేదు సంఘటన ఇంకా మర్చిపోలేదు

ఆ వార్తల్లో నిజం లేదు : బోనీ కపూర్‌

కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’!

విడుదలైన సాహో రొమాంటిక్‌ పాట!

బిగ్‌బాస్‌.. రాహుల్‌ ప్రతీకారం తీర్చుకోనున్నాడా?

అట్టహాసంగా ‘మార్షల్‌’ ఆడియో ఆవిష్కరణ 

‘వాల్మీకి’పై హైకోర్టులో పిటిషన్‌

‘మన పెళ్లి నిన్ననే జరిగినట్లు అనిపిస్తోంది’

బిగ్‌బాస్‌ నిర్వాహకులతో మాకు ఆ సమస్య లేదు! 

మన ఫ్యాషన్‌ మెచ్చెన్ నేషన్

వేసవికి వస్తున్నాం

ఉప్పు తగ్గింది

టీఎఫ్‌సీసీ అధ్యక్షుడిగా ప్రతాని

కొండారెడ్డి బురుజు సెంటర్‌లో...

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విజయ్‌ వర్సెస్‌ విజయ్‌

సూర్య చిత్రానికి అడ్డంకులు

పీవీఆర్‌ సినిమాస్‌, సినిపొలిస్‌లకు షాక్‌

మరో సినిమాతో వస్తా!

కౌసల్య కృష్ణమూర్తి చేయడం అదృష్టం

కీర్తీ... మిస్‌ ఇండియా