మాల్దీవుల్లో రొమాన్స్!

5 Jan, 2014 00:45 IST|Sakshi
మాల్దీవుల్లో రొమాన్స్!
ఆ మధ్య విదేశాల్లోని ఓ బీచ్‌లో ఈత దుస్తుల్లో రణబీర్‌కపూర్, కత్రినా కైఫ్ కెమెరాకి దొరికిపోయిన విషయం తెలిసిందే. రహస్యంగా ప్లాన్ చేసుకున్న ఈ రొమాంటిక్ టూర్ అలా బట్టబయలైనందుకు కత్రినా తెగ ఫీలైపోయారు. ఇప్పుడు నర్గిస్ ఫక్రి వంతు. తన ప్రియుడు ఉదయ్‌చోప్రాతో కలిసి ఈ బ్యూటీ మాల్దీవులు వెళ్లారు. ఈ ట్రిప్ గురించి మూడో కంటికి తెలియదనుకున్నారు. ఎంచక్కా నలుపు రంగు బికినీలో నర్గిస్, స్విమ్ షార్ట్స్‌లో ఉదయ్ అక్కడ ఎంజాయ్ చేశారు.
 
  ఈ ఇద్దర్నీ ఈ దుస్తుల్లో ఎవరో ఫొటో తీసేశారు. ఇక, చెప్పడానికేముంటుంది? ఈ  ఫొటో అంతర్జాలంలో వీరవిహారం చేసేసింది. అసలు తామిద్దరం ప్రేమికులమే కాదని, పెళ్లి అనే సంప్రదాయం మీద తనకు నమ్మకమే లేదని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో నర్గిస్ చెప్పారు. కానీ, ఉదయ్‌చోప్రా మాత్రం ‘‘నీకు తెలుసా? మనిద్దరం బంధువులైపోయాం. భవిష్యత్తులో నీకు పుట్టబోయే కొడుకు తండ్రి ఎవరో కాదు... మా నాన్న కొడుకే’’ అని ట్విట్టర్‌లో పెట్టారు. 
 
  కాసేపటికే, ‘ఓకే ఫైన్.. నర్గిస్, నేను కేవలం స్నేహితులం మాత్రమే’ అని పోస్ట్ చేశారాయన. దీన్నిబట్టి నర్గిస్‌తో ప్రేమని ఉదయ్ సీరియస్‌గానే తీసుకున్నట్లనిపిస్తోంది. కానీ, నర్గిస్ మాత్రం అతనితో ‘టైమ్‌పాస్’ చేస్తున్నారని అర్థమవుతోంది. ఎందుకంటే, ఒకవైపు ఉదయ్‌తో విహార యాత్రలకు వెళుతూ, ఇలా బికినీల్లో పట్టుబడుతున్నారు. మరోవైపు అతనితో తనకేం సంబంధం లేనట్లే వ్యవహరిస్తున్నారామె. ఉదయ్ తన స్నేహితుడు మాత్రమే అంటున్నారు కానీ, స్నేహానికన్నా మరేదో ఈ ఇద్దరి మధ్య ఉందని మాత్రం స్పష్టమవుతోంది.
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా