బిందుమాధవికి భలేచాన్స్‌

24 Apr, 2019 10:20 IST|Sakshi

నటి బిందుమాధవికి భలే చాన్స్‌ తలుపు తట్టనుందని సమాచారం. తెలుగింటి ఆడపడుచు అయిననీ అమ్మడు, తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. కళుగు వంటి చిత్రాల్లో నటిగా చక్కని ప్రతిభను చాటుకుని ప్రశంసలు అందుకుంది. అయినా ఎందుకనో నటిగా రావలసినంత పేరు రాలేదు.  ఈ మధ్య చేతిలో అకాశాలు లేక సొంత ఊరికి వెళ్లిపోయింది కూడా. అలాంటి బిందుమాధవికి అనుకోకుండా ఒక లక్కీచాన్స్‌ తలుపుతట్టిందన్నది తాజా సమాచారం.

దర్శకుడు బాలా విషయానికి వస్తే ఈయన చిత్రాల్లో నటులెంత వాళ్లైనా పాత్రలే కనిపిస్తాయి. బాలా ప్రస్తుతం యువ హీరోలతో మల్టీస్టారర్‌ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల సూర్య హీరోగా చిత్రం చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. బాలా కథను వినిపించారని, అది సూర్యకు బాగా నచ్చిందని  టాక్‌ స్ప్రెడ్‌ అయింది.

అయితే ప్రస్తుతం సూర్య వరుసగా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన ఎన్‌జీకే చిత్రం మేడే సందర్భంగా తెరపైకి రానుంది. కేవీ.ఆనంద్‌ దర్శకత్వంలో నటించిన కాప్పాన్‌ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని సెప్టెంబరులో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ప్రస్తుతం సుధ కొంగర దర్శకత్వంలో సూరరై పోట్రు చిత్రంలో నటిస్తున్నారు. ఆ తరువాత శివ దర్శకత్వంలో ఒక చిత్రం, హరి దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నారు.

దీంతో బాలా దర్శకత్వంలో ప్రస్తుతం నటించలేనని చెప్పడంతో ఆయన మరో కథను తయారు చేసుకున్నారు. ఇందులో యువ నటులు ఆర్య, అధర్వ హీరోలుగా నటించడానికి సై అన్నారు. ఇందులో బిందుమాధవికి నటించే అవకాశం వచ్చిందని సమాచారం. దీనికి జీవీ.ప్రకాశ్‌కుమార్‌ సంగీతం అందించడం మరో విశేషం. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు