'షూ' ఛాలెంజ్‌.. ట్రై చేశారా

22 Apr, 2020 16:17 IST|Sakshi

లాక్‌డౌన్ కార‌ణంగా సినీ ప్ర‌ముఖులు జిమ్‌ల‌కు వెళ్ల‌లేని ప‌రిస్థితి. అయితేనేం? ఇంట్లో ఉంటూ కూడా వ‌ర్క‌వుట్స్ చేయ‌వ‌చ్చు అని నిరూపిస్తున్నారు. దీని కోసం కొత్త మార్గాల‌ను అన్వేషిస్తూ ఫిట్‌నెస్ మంత్రాన్ని పాటిస్తున్నారు. ఆ మ‌ధ్య ర‌కుల్‌ప్రీత్‌సింగ్ టీష‌ర్ట్ ఛాలెంజ్ విస‌ర‌గా, తాజాగా షూ ఛాలెంజ్ ట్రెండ్ అవుతోంది. న‌టి బిపాషా బసు ఈ ఛాలెంజ్‌ని పూర్తిచేసింది. దీని ప్ర‌కారం..  ఒక కాలిపై షూని ఉంచి అది ప‌డిపోకుండా వ‌ర్క‌వుట్ చేయాలి. డీన్ పాండే విసిరిన ఈ ఛాలెంజ్‌ను ఎంతో ఈజీగా పూర్తిచేసేసింది బిపాసా. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ. "హేహే..నేను కూడా ట్రాక్‌లో ఉన్నాను, షూ ఛాలెంజ్‌" అంటూ క్యాప్ష‌న్ జోడించారు. 

టాలీవుడ్‌లోనూ ఛాలెంజ్‌ల హ‌వా న‌డుస్తోంది. ద‌ర్శ‌కుడు సందీప్‌రెడ్డి వంగా ప్రారంభించిన 'బి ద రియల్ మ్యాన్' ఛాలెంజ్ ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తుంది. సామాన్యుల్లాగా ఇంటి ప‌నులు చేస్తూ అభిమానుల చేత శ‌భాష్ అనిపించుకుంటున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖులు ఈ ఛాలెంజ్‌ను పూర్తిచేశారు. లాక్‌ఢౌన్ అయిపోయే లోపు ఇంకెన్ని కొత్త ఛాలెంజ్‌లు పుట్టుకొస్తాయో చూడాలి మ‌రి.

మరిన్ని వార్తలు