బాహుబలి 2 నిర్మాతకు బెదిరింపు ఈమెయిల్‌

16 May, 2017 12:58 IST|Sakshi
బాహుబలి 2 నిర్మాతకు బెదిరింపు ఈమెయిల్‌

హైదరాబాద్‌: భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ‘బాహుబలి 2’  చరిత్ర సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. అయితే బాహుబలి 2ని పైరసీ భూతం వదల్లేదు. తాజాగా బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డకు ఓ బెదిరింపు ఈమెయిల్‌ వచ్చింది.

 బీహార్‌ రాజధాని పాట్నా నుంచి ఓపైరసీ గ్యాంగ్‌ రూ. రెండుకోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. లేకపోతే హెచ్‌డీ సినిమాని ఆన్‌లైన్‌లో ఆప్‌లోడ్‌ చేస్తామని బెదిరించింది. అయితే దీనిపై వెంటనే స్పందించిన యార్లగడ్డ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మఫ్టీలో వెళ్లిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. నేడు కోర్టులో హాజరు పరచనున్నారు.