సమాజానికి దగ్గరగా బ్లఫ్‌మాస్టర్‌

9 Dec, 2018 05:54 IST|Sakshi
పృథ్వీ, సత్యదేవ్, గోపీ గణేశ్, శివలెంక కృష్ణప్రసాద్, కృష్ణ చైతన్య

శివలెంక కృష్ణప్రసాద్‌

‘‘సమాజంలో బ్లఫ్‌ మాస్టర్లు చాలా మంది ఉన్నారు. వారి వల్ల పలువురు మోసపోతున్నారు. ఆ విషయాలను ప్రస్తావిస్తూ గోపీ గణేష్‌ ఈ సినిమా బాగా తీశారు. ప్రస్తుత సమాజానికి దగ్గరగా ఉన్న సినిమా ‘బ్లఫ్‌మాస్టర్‌’. ప్రజల్లో చైతన్యం ఉంటుంది’’ అని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ అన్నారు. సత్యదేవ్, నందితా శ్వేత, ఆదిత్య మీనన్, బ్రహ్మాజీ, పృథ్వీ ముఖ్య తారలుగా గోపీ గణేశ్‌ పట్టాభి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్లఫ్‌మాస్టర్‌’. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ సమర్పణలో రమేష్‌ పి.పిళ్లై నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రైలర్‌ను విడుదల చేశారు. గోపీ గణేశ్‌ పట్టాభి మాట్లాడుతూ– ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. ఈ చిత్రం కోసం పృథ్వీ చాలా కష్టపడ్డారు. సునీల్‌ కశ్యప్‌ సంగీతం వింటే రెహమాన్‌ సంగీతం చేశారా? అనిపించింది’’ అన్నారు.  ‘‘ఈ సినిమాలో మోసపోయే వాళ్లల్లో నేనూ ఒకడిని. దో నంబర్‌ అనే బిజినెస్‌లో మిడిల్‌ క్లాస్‌ వాళ్లను టార్గెట్‌ చేసి ట్రాప్‌ చేస్తుంటారు’’ అన్నారు సత్యదేవ్‌. సంగీత దర్శకుడు సునీల్‌ కశ్యప్‌ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కథ: హెచ్‌. వినోద్, అడిషనల్‌ డైలాగ్స్‌: పులగం చిన్నారాయణ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: ఎం.కృష్ణకుమార్‌ (కిట్టు), కెమెరా: దాశరథి శివేంద్ర.
 

మరిన్ని వార్తలు