నిలకడగా దిలీప్ కుమార్ ఆరోగ్యం

16 Sep, 2013 15:02 IST|Sakshi

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలీవుడ్ హీరో దిలీప్ కుమార్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. సోమవారం కూడా  ముంబై లీలావతి ఆస్పత్రి ఐసీయూలోనే ఉంచారు. 90 ఏళ్ల దిలీప్ కుమార్ ఆదివారం అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. 'దిలీప్ ఇంకా ఐసీయూలోనే ఉన్నాక్షేమంగా ఉన్నారు. ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. ఆందోళన చెందాల్సిన పనిలేదు. సైరా బాను ఆయన చెంతనే ఉన్నారు' అని సైరాబాను మేనేజర్ ముర్షీద్ఖాన్ చెప్పారు.

కాగా దిలీప్ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. స్వల్ప అస్వస్థతకు మాత్రమే గురయ్యారని ముర్షీద్ తెలిపారు.