రావణుడిగా హీరోయిన్ తండ్రి

22 Oct, 2015 17:30 IST|Sakshi
రావణుడిగా హీరోయిన్ తండ్రి

దేశ రాజధాని ఢిల్లీలో ఏటా ఘనంగా నిర్వహించే దసరా వేడుకల్లో ఈసారి ఓ హీరోయిన్ తండ్రి రావణాసురుడి వేషం వేసి అందరినీ అలరించారు. తన అందం, అభినయంతో ప్రస్తుతం బాలీవుడ్ని ఊపేస్తున్న గులాబి బాల శ్రద్ధా కపూర్ తండ్రి,  ప్రముఖ నటుడు శక్తి కపూర్ ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరుగుతున్న దసరా వేడుకల్లో రావణాసురుడి వేషం వేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఉత్తరాదిలో దసరాను ఎంతో వేడుకగా నిర్వహించుకుంటారు. ప్రధానంగా రాంలీలా మైదానంలో భారీ ఎత్తున రావణాసురుడి బొమ్మను పెట్టి.. దాన్ని దహనం చేయించడం అలవాటు. అలాగే పలువురు ప్రముఖులు కూడా వీటిలో రకరకాల వేషాలు వేస్తుంటారు.

 

ఈసారి ఢిల్లీ ఎర్రకోట వేడుకల్లో శక్తి కపూర్ తన నటనా సామర్థ్యాన్ని ప్రత్యక్షంగా ప్రజలకు చూపించారు. సినిమాల్లో విలన్గా ఎంత భయపెట్టగలడో కమెడియన్గా అంతే నవ్వించగల విలక్షణ నటుడు 'శక్తి కపూర్'. ఆయన ముద్దుల తనయ శ్రద్ధా కపూర్ కూడా తండ్రి బాటలోనే తన మార్క్ నటనతో బాలీవుడ్లో స్థానం సుస్థిరం చేసుకుంటోంది.