కుకింగ్‌.. క్లీనింగ్‌

27 Mar, 2020 01:08 IST|Sakshi

కోవిడ్‌ 19 (కరోనావైరస్‌)తో దేశవ్యాప్తంగా థియేటర్స్, షూటింగ్స్‌ అన్నీ బంద్‌ అయ్యాయి. దీంతో సినిమా తారలందరూ హోమ్‌ క్యారంటైన్‌లో ఉన్నారు. షూటింగ్స్, ప్రమోషన్స్‌ ఎప్పుడూ బిజీగా ఉండే వీరికి కాస్త ఖాళీ సమయం దొరకడంతో రోటిన్‌కి భిన్నంగా ఎవరికి వారు తమకు తోచిన పనిలో నిమగ్నమైపోయారు. ముఖ్యంగా హీరోయిన్లు అయితే గరిటె తిప్పే పనిలో పడిపోయారు. బెండాకాయ వేపుడు చేశారు ఇలియానా. హౌస్‌ క్లీనింగ్‌ పనిలో పడిపోయారు తాప్సీ. ఓ చైనీస్‌ వంటకం చేశారు వరలక్ష్మీ శరత్‌కుమార్‌. బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్కా శర్మ తన తండ్రి (అజయ్‌ శర్మ) కోసం స్వయంగా కేక్‌ చేశారు. వర్కౌట్‌కి సై అన్నారు సన్నీ లియోన్‌. చీపురు పట్టుకుని గార్డెను క్లీన్‌ చేశారు బాలీవుడ్‌ హీరో ఆదిత్యారాయ్‌ కపూర్‌. షూటింగ్‌కి బదులుగా కుకింగ్‌.. క్లీనింగ్‌తో బిజీ బిజీగా ఉంటున్నారు తారలు.

అనుష్కాశర్మ చేసిన కేక్‌, ఆదిత్యారాయ్‌ కపూర్‌, ఇల్లు క్లీన్‌ చేస్తున్న తాప్సీ


ఇలియానా చేసిన కూర, సన్నీలియోన్‌, వరలక్ష్మీ చేసిన చైనీస్‌ డిష్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు