హల్చల్ చేస్తున్న మెగా వారసురాలు

21 Mar, 2016 16:35 IST|Sakshi
హల్చల్ చేస్తున్న మెగా వారసురాలు

ముంబై:   ఈ మధ్య కాలంలో సోషల్  మీడియాలో ఫోటోలతో  సంచలనం సృష్టిస్తున్న  బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు 'నవ్య నవేలి నంద' మరోసారి  వార్తల్లో నిలిచింది. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండానే  తనదైన శైలిలో సోషల్ మీడియాలో వైరల్ లా  మారడం బాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. లండన్‌లోని ప్రఖ్యాత సెవెన్ ఓక్స్ స్కూల్లో చదువుకుంటున్న నవ్య  తాజాగా మరికొన్ని ఫోటోలను  ఇన్స్టాగ్రామ్ లో  షేర్ చేసింది.  ఓ యువకుడితో   కలిసి ఉన్న ఫోటోలను ఆమె పోస్టు చేసింది.

సెలబ్రిటీ కుటుంబానికి చెందిన నవ్య కొన్ని సంచలన ఫోటోలను  షేర్ చేయడం  సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారడం కామనే.  ఇటీవలే ఆమె 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తనతో పాటు చదువుకుంటున్న గర్ల్ గ్యాంగ్, మరికొందరు స్టార్ కిడ్స్ తో కలిసి పార్టీ చేసుకుంది. దీంతోపాటు, తన స్నేహితులతో కలిసి వివిధ సందర్బాల్లో దిగిన ఫోటోలను ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తోంది.  ఈ ఫోటోల్లో లండన్ లోనే చదువుకుంటున్న షారుక్ తనయుడు ఆర్యన్  ఎక్కువగా దర్శనమిచ్చిన  సంగతి తెలిసిందే..