కరోనాతో బాలీవుడ్ నిర్మాత కన్నుమూత

6 Jun, 2020 09:33 IST|Sakshi
ఫైల్ ఫోటో

సాక్షి, ముంబై : బాలీవుడ్  పరిశ్రమలో వరుస కరోనా  కేసులు కలవరం రేపుతున్నాయి. తాజాగా బాలీవుడ్ నిర్మాత అనిల్ సూరి (77) క‌న్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం తుది శ్వాస విడిచారని ఆయన సోదరుడు రాజీవ్ సూరి వెల్లడించారు.

ముంబైలోని తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్ సోదరుడిని చేర్చుకునేందుకు  లీలావ‌తి, హిందూజా ఆసుప‌త్రి వర్గాలు నిరాకరించారని అనిల్ సోద‌రుడు , నిర్మాత రాజివ్ సూరి ఈ సందర్భంగా  ఆరోపించారు. అనిల్ జూన్ 2 నుండి తీవ్ర జ్వరంతో బాధ‌ప‌డ్డారనీ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా ప‌రిస్థితి పూర్తిగా క్షీణించడంతో బుధవారం రాత్రి అడ్వాన్స్ డ్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రికి తరలించామని చెప్పారు. వెంటిలేటర్ పై ఉన్న ఆయన గురువారం రాత్రి కన్నుమూశారని రాజీవ్ సూరి తెలిపారు.  

పూర్తి నిబంధలను పాటిస్తూ, వ్యక్తిగత రక్షణ సామగ్రి (పీపీఈ)తో శుక్ర‌వారం ఉద‌యం కేవ‌లం కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో అనిల్ అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించామన్నారు. తన అభిమాన దర్శకులలో ఒకరిని, సోదరుడిని ఒకే రోజు కోల్పోవడం బాధాకరమని రాజీవ్ సంతాపం వ్యక్తం చేశారు. కాగా రాజ్‌కుమార్‌, రేఖ కాంబినేషన్‌లో ‘కర్మయోగి’, ‘రాజ్‌ తిలక్‌’ వంటి చిత్రాలను అనిల్ సూరి నిర్మించారు. అనిల్ కు ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు. (బాలీవుడ్‌ సంగీత దర్శకుడు వాజిద్‌ కన్నుమూత)

మరిన్ని వార్తలు