కన్నడకు స్వాగతం!

12 Mar, 2019 03:06 IST|Sakshi
బొమన్‌ ఇరానీ

ఏ ఇండస్ట్రీలో అయినా, తొలి పరిచయం ఒక్కసారే జరుగుతుంది. కానీ ఫిల్మ్‌ఇండస్ట్రీలోనే తొలి పరిచయం పలుసార్లు జరిగే అవకాశం వస్తుంది. ఒక ఇండస్ట్రీలో స్టార్స్‌  మరో ఇండస్ట్రీలోకి పరిచయం అవడం ఫస్ట్‌ టైమ్‌ అన్నట్లేగా.  తాజాగా బాలీవుడ్‌ నటుడు బొమన్‌ ఇరానీ కన్నడ పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు. కన్నడ సూపర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ హీరోగా ‘యువరత్న’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ద్వారా కన్నడ ప్రేక్షకులను పలకరించడానికి ఇరానీ రెడీ అయ్యారని సమాచారం. సంతోష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో రిలీజ్‌ కానుంది. ఆల్రెడీ ‘అత్తారింటికి దారేది, బెంగాల్‌ టైగర్‌’ సినిమాలతో బోమన్‌ ఇరానీ తెలుగులో కనిపించిన సంగతి గుర్తుండే ఉంటుంది.

మరిన్ని వార్తలు