కథను నమ్మి తీశారు

31 Jan, 2016 23:42 IST|Sakshi
కథను నమ్మి తీశారు

‘‘ఎటువంటి అశ్లీలతకు తావు లేకుండా దర్శకుడు ఈ చిత్రాన్ని తీసిన తీరు అభినందనీయం. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసిన అనుభూతి కలిగింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుంది’’ అని మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు. నూతన నటీనటులతో మీడీవల్ స్టోరీ టెల్లర్స్ పతాకంపై నిశాంత్ పుదారి దర్శకత్వంలో పుదారి అరుణ నిర్మించిన చిత్రం ‘బొమ్మల రామారం’. ఇటీవల ప్రముఖ గాయని పి.సుశీల చేతుల మీదుగా ఈ చిత్రం పాటలు విడుదలయ్యాయి.

ఈ చిత్రం తొలి కాపీని దర్శక-నిర్మాతలు విద్యాసాగర్ రావుకు చూపించారు. ‘‘పాటలన్నీ బాగున్నాయి. కథను నమ్మి ఈ చిత్రం తీశారు. మంచి  విజయం చేకూరాలని కోరుకుంటున్నా’’ అని విద్యాసాగర్ రావు అన్నారు. ‘‘మార్చి 4న రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: బివి అమర్‌నాథ్ రెడ్డి, సంగీతం: కార్తీక్ కొడకండ్ల.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments