అందరికీ నెగటివ్‌... ఆల్‌ హ్యాపీ

6 Jun, 2020 00:35 IST|Sakshi
బోనీకపూర్‌

కరోనా పరీక్షల్లో నెగటివ్‌ వచ్చిందని తెలిపారు ప్రముఖ నిర్మాత బోనీకపూర్‌. ఇటీవల బోనీకపూర్‌ ఇంటి సిబ్బందిలో ముగ్గురికి కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో బోనీ అండ్‌ ఫ్యామిలీ 14 రోజులు హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చింది. ఈ క్వారంటైన్‌ పీరియడ్‌ ముగిసిందని తెలిపారు బోనీకపూర్‌. ‘‘మా 14 రోజుల హోమ్‌ క్వారంటైన్‌ పూర్తయింది.  కరోనా బారిన పడి, ట్రీట్‌మెంట్‌ చేయించుకున్న మా ఇంటి సిబ్బందిలో ఉన్న ముగ్గురికి కూడా ఇప్పుడు కరోనా పరీక్షల్లో నెగటివ్‌ వచ్చింది.

అలాగే నేను, నా కుమార్తెలు (జాన్వీకపూర్, ఖుషీకపూర్‌) పరీక్ష చేయించుకుంటే నెగటివ్‌ వచ్చింది. ఇతర సిబ్బందికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు.  అందరికీ నెగటివ్‌ వచ్చింది. ఆల్‌ హ్యాపీ. ఇక మా డైలీ లైఫ్‌ను ఫ్రెష్‌గా స్టార్ట్‌ చేయాలనుకుంటున్నాం. అలాగే కరోనా సోకి క్వారంటైన్‌లో ఉన్నవారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వ సూచనలను అందరూ  పాటించాలి. కరోనా కట్టడి కోసం పోరాడుతున్న డాక్టర్స్, ఇతర హెల్త్‌కేర్‌ వర్కర్స్, ముంబై పోలీసులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు బోనీకపూర్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు