బుక్‌... లక్‌!

1 Apr, 2017 23:26 IST|Sakshi
బుక్‌... లక్‌!

‘అమ్మాయి.. నువ్వు పుస్తకాలు చదివితే నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది’... నాలుగైదేళ్ల క్రితం సోనాక్షీ సిన్హాకు ఓ పెద్ద జ్యోతిష్కుడు ఇచ్చిన సలహా ఇది. వెంటనే ఈ బ్యూటీ బోల్డన్ని పుస్తకాలు కొన్నారేమో అనుకుంటున్నారా? అదేం లేదు. సోనాక్షి ఈ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. కానీ, ఈ మధ్య ఆ జ్యోతిష్కుడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయట. ఆ విషయం గురించి సోనాక్షీ మాట్లాడుతూ – ‘‘నేను జాతకాలను నమ్మను. ఆ జ్యోతిష్కుడు నన్ను బుక్స్‌ చదవమన్నా చదవలేదు. విచిత్రం ఏంటంటే.. మూడేళ్ల క్రితం నేను చేసిన ‘లుటేరా’ రచయిత ఒ. హెన్రీ రాసిన కథ ఆధారంగా తీసినది. ఈ నెలలో విడుదలకు సిద్ధమవుతున్న ‘నూర్‌’ సబా ఇంతియాజ్‌ రాసిన నవల ఆధారంగా తీసిన చిత్రం.

 ‘లుటేరా’ నాకు మంచి పేరు తెచ్చిపెట్టడంతో పాటు మంచి విజయం సాధించింది. ‘నూర్‌’ ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభించింది. సినిమా కూడా హిట్టవుతుంది. ఈ ఆరేళ్లల్లో నేను 20కి పైగా సినిమాలు చేస్తే, వాటిలో ‘లుటేరా’, ‘నూర్‌’ నా హార్ట్‌కి బాగా దగ్గరయ్యాయి. సో.. పుస్తకాలకూ, నాకూ నిజంగానే ఏదైనా కనెక్షన్‌ ఉండి ఉంటుందా? ఆ జ్యోతిష్కుడు చెప్పినట్లు పుస్తకాలు నాకు కలిసొస్తాయా? ఏమో.. ఇలాంటివాటి మీద నాకు పెద్దగా నమ్మకం లేదు. ఏదో యాదృచ్ఛికంగా జరిగిందనిపిస్తోంది’’ అన్నారు.