స్టార్ హీరో, డైరెక్టర్కు మరో షాక్

19 Jul, 2017 14:57 IST|Sakshi
స్టార్ హీరో, డైరెక్టర్కు మరో షాక్

ముంబయి: ఇటీవల విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకున్న మూవీ 'జగ్గా జాసూస్'. ఆ మూవీ హిట్ టాక్తో కత్రినా కైఫ్ హ్యాపీగా ఉన్నా స్టార్ హీరో రణ్బీర్ కపూర్ మాత్రం కాస్త డీలా పడ్డాడు. ఓ మూవీ షూటింగ్ పనులు ప్రారంభించగానే మరో ఆటంకం తలెత్తడమే అందుకు కారణం. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ, రణ్బీర్ కపూర్ లేటేస్ట్ ప్రాజెక్ట్ 'డ్రాగన్'. గత మూడేళ్ల నుంచి సన్నాహాలు జరుగుతున్న ఈ మూవీని త్వరగా తెరకెక్కించాలని ఇప్పటికే ఆలస్యమైందని ఈ ఇద్దరు టెన్షన్ పడుతున్నారు. ప్రీ పొడ్రక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ ఇద్దరికి మూవీ యూనిట్ సభ్యులు భారీ షాకిచ్చారు.

గత మూడేళ్లుగా సాగుతోన్న ఈ మూవీ కథలో మార్పులు చేయాలని, ప్రస్తుతం ఉన్న కథపై తమకు నమ్మకం లేదని దర్శకుడికి యూనిట్ తేల్చి చెప్పేసింది. దీంతో మూవీ షూటింగ్ మరికొన్ని రోజులు వాయిదా వేయాల్సి వచ్చింది. గతంలో దర్శకుడు అయాన్ రణబీర్ తో తీసిన 'ఏ జవానీ హే దివానీ' మాత్రం సక్సెస్ అయిందని, స్క్రిప్టు వర్క్ బాగుండాలని మూవీ యూనిట్ సూచించింది. మరోవైపు సంజయ్ దత్ బయోపిక్లో నటిస్తున్న రణబీర్ ను డ్రాగన్ మూవీకి తలెత్తుతున్న ఇబ్బందులు అసహనానికి గురిచేస్తున్నాయి. దీంతో గత వారం విడుదలైన జగ్గా జాసూస్ సక్సెస్ను ఎంజాయ్ చేయలేకపోతున్నాడు రణబీర్.