మాజీ భార్య ఆరోపణలపై హీరో ఆవేదన

9 Aug, 2018 16:56 IST|Sakshi

హాలీవుడ్‌లో లాంగ్‌ రిలేషన్‌షిప్‌ కొనసాగించిన జంట ‘బ్రాంజెలీనా’(బ్రాడ్‌ పిట్‌+ఏంజెలినా జోలీ).. అనూహ్య కారణాలతో విడిపోయిన విషయం విదితమే. ఆ కారణాల వెనుక రకరకాల ఊహాగానాలు వినిపించినప్పటికీ.. అసలు కారణంపై మాత్రం ఇద్దరిలో ఎవరూ స్పష్టత ఇవ్వలేదు. ఇదిలా ఉంటే పిల్లల పోషణార్థం బ్రాడ్‌ పిట్‌ తమకు ఇంత వరకు నయా పైసా చెల్లించలేదని ఏంజెలీనా జోలీ ఓ పిటిషన్‌ దాఖలు చేయగా.. బ్రాడ్‌ పిట్‌ స్పందించాడు.

‘ఆమె చేసే ఆరోపణల్లో నిజం కాదు. విడాకుల పిటిషన్‌ సమయంలోనే ఆమె 9 మిలియన్‌ డాలర్ల దాకా భరణం చెల్లించాను. కేవలం నాపేరును చెడగొట్టేందుకే ఇప్పుడు ఈ ఆరోపణలు. మీడియా దృష్టిని తనవైపు తిప్పుకునేందుకే ఆమె ఇలా చేస్తోంది ’ అని బ్రాడ్‌ పిట్‌ తన లాయర్‌ ద్వారా ఓ ప్రకటన ఇప్పించాడు. ఇదిలా ఉంటే పిట్‌ ప్రకటనపై ఏంజెలీనా ఇంకా స్పందించలేదు.

మిస్టర్‌ అండ్‌ మిస్‌ స్మిత్‌ చిత్ర షూటింగ్‌లో మొదలైన వీళ్ల ప్రేమ.. 9 ఏళ్లపాటు సహజీవనంగానే సాగింది. 2014లో వీళ్లు వివాహం తీసుకోగా.. రెండేళ్ల తర్వాత(2016లో) విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ జంటకు మొత్తం ఆరుగురు పిల్లలు(దత్తత)  ఉండగా.. ప్రస్తుతం వాళ్లంతా తల్లి సంరక్షణలోనే ఉన్నారు. ఇదిలా ఉంటే పిల్లలను జాయింట్‌ కేరింగ్‌కు అప్పగించాలని ‘పిట్‌’ ఓ పిటిషన్‌ కూడా దాఖలు చేయటం గమనార్హం. 

కొడుకు వయసున్న అమ్మాయితో... 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా