బ్రహ్మ దర్శకత్వంలో ఆ ఇద్దరు

7 Mar, 2016 03:43 IST|Sakshi
బ్రహ్మ దర్శకత్వంలో ఆ ఇద్దరు

జాతీయ ఉత్తమ దర్శకుడు బ్రహ్మ దర్శకత్వంలో సూర్య, జ్యోతిక దంపతులు చిత్రం చేయనున్నారన్నది తాజా సమాచారం. కుట్రం కడిదల్ చిత్రం పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అవార్డులు,రివార్డులు అందుకున్న చిత్రం.అంతే కాదు దర్శకుడు బ్రహ్మకు జాతీయ అవార్డును అందించిన చిత్రం ఇది. మరో విశేషం ఈ దర్శకుడికిది తొలి చిత్రం కావడం. మొదటి చిత్రాన్ని నూతన తారలతో తెరకెక్కించి వారి నుంచి సహజత్వంతో కూడిన నటనను రాబట్టిన బ్రహ్మ తదుపరి చిత్రానికి సిద్ధమయ్యారు.

ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి నటీనటులు సూర్య, జ్యోతిక పనిచేయనుండడం. వివరంగా చెప్పాలంటే బ్రహ్మ దర్శకత్వంలో నటుడు సూర్య తన 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్ పతాకంపై నిర్మించనున్న ఈ చిత్రంలో ఆయన అర్ధాంగి జ్యోతిక ప్రధాన పాత్రను పోషించనున్నారన్నది కోలీవుడ్ సమాచారం. ఈమె సుదీర్ఘ విరామం తరువాత వివాహనంతరం 36 వయదినిలే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది. అయితే ఆ తరువాత మంచి కథ కోసం ఎదురు చూస్తున్న జ్యోతికను ద ర్శకుడు బ్రహ్మ చెప్పిన కథ బాగా ఇంప్రెస్ చేసిందని, ఆ కథలో నటించడానికి ఆమె అంగీకరించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనున్నట్లు తెలిసింది.