మా అబ్బాయి వస్తానంటే యస్‌ అన్నాను

5 Mar, 2020 00:17 IST|Sakshi
బ్రహ్మాజీ

‘‘తల్లిదండ్రులు ఏ రంగంలో ఉంటే తమ పిల్లల్ని కూడా ఆ రంగంలో పైకి తీసుకురావాలనుకుంటారు.. నేను కూడా అలాగే అనుకున్నాను. మా అబ్బాయి సంజయ్‌ సినిమాల్లోకి వస్తానని చెప్పినప్పుడు ‘ప్రయత్నించు.. వర్కౌట్‌ అయితే ఉండు.. లేకపోతే నీకు నచ్చింది చేసుకో’ అన్నాను. ఒక తండ్రిగా ఎంత సహకారం అందించాలో అంత చేశా. తనని సోలో హీరోగా పరిచయం చేయొచ్చు. కానీ, ఒక మంచి పాత్ర ద్వారానే తెలుగు ప్రేక్షుకులకు దగ్గరవ్వాలని ‘ఓ పిట్టకథ’ సినిమా చేశాడు’’ అన్నారు  నటుడు బ్రహ్మాజీ. విశ్వంత్‌ దుద్దంపూడి, సంజయ్, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ పిట్టకథ’. చెందు ముద్దు దర్శకత్వంలో వి. ఆనంద ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా బ్రహ్మాజీ మాట్లాడుతూ– ‘‘ఓ పిట్టకథ’లో అమలాపురంలో ఉండే ఒక ఇన్వెస్టిగేట్‌ ఆఫీసర్‌ పాత్రలో నటించాను. నా పాత్ర సీరియస్‌గా ఉంటుంది. ఒక అమ్మాయి అదృశ్యం అవుతుంది.. ఎలా అదృశ్యం అయింది? అనే కోణంలో నా పాత్ర సాగుతుంది. ఈ సినిమాలో మంచి స్క్రీన్‌ప్లే ఉంది. తెలుగులో ఇంతవరకూ ఇలాంటి స్క్రీన్‌ప్లే రాలేదు. థ్రిల్లింగ్‌ అంశాలు కూడా ఉంటాయి. నేను యంగ్‌గా కనిపించడానికి ప్రత్యేక కారణాలేవీ లేవు.. జీ¯Œ ్స ప్రభావం అంతే. ఇండస్ట్రీలో అందరి హీరోలతో మంచి బంధాల్ని కొనసాగిస్తున్నాను. హీరోలందరూ ఫ్రెండ్సే. కలిసి పార్టీలు చేసుకుంటాం.. అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా ఉంటారు. ‘ఓ పిట్టకథ’ సినిమాని దర్శకులు కృషవంశీ, అనిల్‌ రావిపూడి, మేర్లపాక గాంధీ, హను రాఘవపూడి.. వంటి వారు చూశారు.. వాళ్లకి బాగా నచ్చింది.. ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.

మరిన్ని వార్తలు