‘ఎమోషనల్‌ క్యారెక్టర్‌ చేశా.. ఆ సినిమా చూడండి’

11 Nov, 2019 20:42 IST|Sakshi

బాలీవుడ్‌లో పలు హిట్‌ చిత్రాలు తీసిన బొకాడియా ‘నమస్తే నేస్తమా’ అనే సినిమా ద్వారా తెలుగులో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.  గతంలో ఆయన నిర్మాణంలో బ్లాక్‌బస్టర్‌హిట్‌ సాధించిన ‘తేరి మెహర్భానియా’  సినిమా స్ఫూర్తితో వస్తోన్నఈ మూవీని తెరకెక్కించారు. ఈషానియ మహేశ్వరి, నాజర్‌, బ్రహ్మానందం, షాయాజీ షిండే, తాగుబోతు రమేష్‌, చమ్మక్‌ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీరామ్‌ అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో రెండు కుక్కలు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నాయి. ఈ చిత్రానికి బప్పిలహరి, చరణ్‌ అర్జున్‌ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. 

త్వరలో విడుదల కాబోతున్న‌ ఈ చిత్రంలోని తన పాత్ర గురించి నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ.. ‘‘కెసి బొకాడియా నిర్మించి తొలిసారి తెలుగులో దర్శకత్వం వహించిన సినిమా ‘నమస్తే నేస్తమా’.  ఈ సినిమాలో నేను హాస్యమే కాకుండా కొంచెం ఎమోషనల్‌గా ఉండే క్యారెక్టర్ చేశాను. నాకు చాలా సంతృప్తిని ఇచ్చిన క్యారెక్టర్. బొకాడియా నిర్మాతగా చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఆయనతో సినిమా చేస్తున్నపుడు ఏ రకమైన టెన్షన్ లేకుండా ఎంతో హ్యాపీగా తనకు కావాల్సినటువంటి రీతిలో ఆర్టిస్టుల నుండి కావాల్సిన పెర్ఫామెన్స్ రాబట్టుకుని అద్భుతమైన సినిమా నిర్మించారు. నమస్తే నేస్తమా సినిమా థియేటర్‌లో చూడండి. పర్టిక్యులర్‌గా నా క్యారెక్టర్ బాగుంటుందని మీకు చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’ అని బ్రహ్మానందం అన్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు