ఏదైనా ‘బ్రాండ్‌’ కావాల్సిందే...!

26 Jul, 2018 12:36 IST|Sakshi

ఎంటర్‌టైనింగ్‌ చిత్రాల దర్శకుడు మారుతి.. మరో యూత్‌ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకులకు అందించబోతున్నారు. ప్రభాకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘బ్రాండ్‌ బాబు’  చిత్ర ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది. మారుతి కథను అందించగా.. జేబీ మ్యూజిక్‌ సమకూర్చాడు. కాగా, ఈ చిత్రంతో సుమంత్‌ శైలేంద్ర హీరోగా పరిచయం కాబోతున్నాడు. తన చిత్రాల్లో హీరోలకు ఏదో ఒక వీక్‌నెస్‌ పెట్టే మారుతి.. ఈ చిత్రంలో హీరోకు బ్రాండ్‌ అనే జాడ్యాన్ని అంటగట్టాడు. బ్రాండ్‌ వస్తువులు వాడితే కానీ ఎదుటి వ్యక్తితో మాట్లాడని డైమండ్‌.. ఓ పేదింటి అమ్మాయిని ప్రేమించటం, ఇంట్లో వాళ్లు అడ్డు చెప్పటం, వాళ్లను ఎదిరించి తన ప్రేమను ఎలా గెలిపించుకోగలిగాడు. తదితర కథనంతో ఈ చిత్రం తెరకెక్కింది. సుమంత్‌ సరసన తెలుగమ్మాయి ఈషా రెబ్బా హీరోయిన్‌గా నటిస్తోంది. రాజా రవీంద్ర, మురళీ శర్మ, సాయి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు