తను నీడలో ఉంది

14 Jun, 2020 03:41 IST|Sakshi
నిత్యా మీనన్‌; ‘బీత్‌: ఇన్‌ టు ది షాడోస్‌ ఫస్ట్‌ లుక్‌

‘అలా మొదలైంది, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, సన్నాఫ్‌ సత్యమూర్తి, జనతా గ్యారేజ్‌’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు నిత్యా మీనన్‌. అంతేకాదు.. తన నటనతో మలయాళం, కన్నడ, తమిళ్, హిందీ ప్రేక్షకుల హృదయాల్లోనూ చోటు సంపాదించుకున్న ఈ మలయాళ బ్యూటీ తొలిసారి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అది కూడా బాలీవుడ్‌ స్టార్‌ హీరో అభిషేక్‌ బచ్చన్‌తో కలిసి ‘బ్రీత్‌: ఇన్‌ టు ది షాడోస్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు.

మాధవన్, అమిత్‌ సాధ్‌ నటించిన సూపర్‌ హిట్‌ ‘బ్రీత్‌’ వెబ్‌ సిరీస్‌కి ఇది రెండవ సీజన్‌. రెండో సీజన్‌లో అమిత్‌ సాధ్‌ కూడా కీలక పాత్రలో నటించారు. జూలై 10 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ‘బ్రీత్‌: ఇన్‌ టు ది షాడోస్‌’ ప్రసారం కానుంది. కాగా అభిషేక్‌ బచ్చన్, నిత్యా మీనన్‌లకు ఇది తొలి వెబ్‌ సిరీస్‌ కావడం విశేషం. ‘తను నీడలో ఉంది... కనుగొనబడటానికి వేచి చూస్తోంది’ అంటూ ఈ సిరీస్‌ తొలి పోస్టర్‌ని విడుదల చేశారు.
 

మరిన్ని వార్తలు