మానవీయ విలువలకు వారధి

26 Apr, 2017 23:56 IST|Sakshi
మానవీయ విలువలకు వారధి

రాహుల్‌ రవీంద్రన్‌ హీరోగా రేవన్‌ యాదు దర్శకత్వంలో ఎమ్‌.వి. స్టూడియోస్‌ ప్రై.లి. సంస్థ నిర్మిస్తున్న సినిమా ‘హౌరా బ్రిడ్జ్‌’. చాందినీ చౌదరి, మనాలీ రాథోడ్‌ హీరోయిన్లు. హైదరాబాద్‌లో ప్రచార చిత్రాలను విడుదల చేశారు. రాహుల్‌ రవీంద్రన్‌ మాట్లాడుతూ – ‘‘హ్యూమన్‌ రిలేషన్స్‌కి ఈ కథ బ్రిడ్జ్‌గా ఉంటుంది. ఇందులో మరో బ్రిడ్జ్‌ కూడా ఉంది.

ఆ బ్రిడ్జ్‌ ఏంటి? అనేది ఇప్పుడే చెప్పను. ప్రస్తుతానికి సస్పెన్స్‌’’ అన్నారు. రేవన్‌ యాదు మాట్లాడుతూ – ‘‘ఓ వంతెన (బ్రిడ్జ్‌) నేపథ్యంలో జరిగే ఆసక్తికరమైన కథ ఇది. వచ్చే నెల మొదటి వారంలో టీజర్, రెండో వారంలో ఆడియో, నెలాఖరున సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో చాందినీ చౌదరి, మనాలీ రాథోడ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, కెమేరా: విజయ్‌ మిశ్రా, సంగీతం: శేఖర్‌ చంద్ర.