బృందావనంలో కొత్తవాళ్లు!

1 Aug, 2017 23:51 IST|Sakshi
బృందావనంలో కొత్తవాళ్లు!

‘బృందావనమది అందరిది’ చిత్రంతో తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన శ్రీధర్‌ సీపాన దర్శకుడిగా మారుతున్నారు. అంతా కొత్త నటీనటులతో తీయనున్న ఈ సినిమా గురించి శ్రీధర్‌ సీపాన మాట్లాడుతూ– ‘‘దర్శకునిగా మారడం ఆనందంగా ఉంది. రచయితగా నన్ను ఆదరించిన ప్రేక్షకులు దర్శకుడిగానూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

 జంధ్యాలగారిలా అందరూ నవ్వుకునే సినిమాలు తీయాలనుకుంటున్నాను. అందుకే కమర్షియల్‌ కథలు ఉన్నా అవన్నీ పక్కనపెట్టి ఈ వినోదాత్మక కథను ఎంచుకున్నాను. వినోదాత్మకంగా ఉంటూనే మనలోని బంధాలను గుర్తు చేసేలా ఉంటుందీ సిన్మా. కథ, ఫైట్లు, పాటలు ఉండే సాధరణ చిత్రంలా ఉండదు. ఈ సినిమాతో దర్శకుడిగా నాకో మార్క్‌ తెచ్చుకోవాలనుకుంటున్నాను’’అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి